• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MIM MP ASADUDDIN OWAISI SLAMS CONGRESS PARTY FOR A DEROGATORY POSTER ON HIM AND CM KCR BA

ప్రియాంకాగాంధీని అలా గీస్తే ఊరుకుంటారా? : కాంగ్రెస్‌పై అసదుద్దీన్ ఫైర్

ప్రియాంకాగాంధీని అలా గీస్తే ఊరుకుంటారా? : కాంగ్రెస్‌పై అసదుద్దీన్ ఫైర్

అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణలో ప్రజాస్వామ్యం వస్త్రాపహరణం అవుతోందంటూ కాంగ్రెస్ పార్టీ వేసిన పోస్టర్ తీవ్ర దుమారం రేపింది. దీనిపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు.

  • Share this:
    తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయంటూ టీ కాంగ్రెస్ చేపట్టిన నిరసన పెను దుమారం రేపింది. ఈ ప్రదర్శన సందర్భంగా ఓటర్లను వస్త్రాపహరణం చేస్తున్నట్టు ఓ పోస్టర్‌ను ముద్రించారు. EROలు, DEOలు, CEO అందరినీ దుశ్శాసనులుగా, ఓటర్లను ద్రౌపదిగా చిత్రీకరించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని వీరంతా కలసి వస్త్రాపహరణం చేస్తున్నా సరే.. ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుందనే విధంగా ఆ పోస్టర్‌ను రూపొందించారు. ఓ వైపు ప్రజాస్వామ్య వస్త్రాపహరణం జరుగుతుంటే, మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పక్కన వేడుక చూస్తున్నట్టు బ్యానర్‌‌పై ముద్రించారు. ఇది పెను దుమారం రేపింది.

    తెలంగాణ కాంగ్రెస్ తయారు చేసిన పోస్టర్ (ANI)
    తెలంగాణ కాంగ్రెస్ తయారు చేసిన పోస్టర్ (ANI)


    కాంగ్రెస్ చేసిన పనిపై ఫైర్ అయ్యారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ‘శ్రీ శ్రీ 50 ఏళ్ల రాహుల్ గాంధీ మీద కానీ, కొత్తగా జనరల్ సెక్రటరీ అయిన ప్రియాంకాగాంధీ మీద కానీ ఇలాంటి కార్టూన్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది?’ అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్టూన్లు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సమంజసం కాదని అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.
    First published: