కరీంనగర్ ప్రసంగంలో ఎలాంటి తప్పులేదు... అక్బరుద్దీన్ వివరణ

Akbaruddin owaisi | కరీంనగర్‌లో తాను చేసిన ప్రసంగంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపీ వివరణ ఇచ్చారు.

news18-telugu
Updated: July 26, 2019, 4:02 PM IST
కరీంనగర్ ప్రసంగంలో ఎలాంటి తప్పులేదు... అక్బరుద్దీన్ వివరణ
అక్బరుద్దీన్ (File)
news18-telugu
Updated: July 26, 2019, 4:02 PM IST
ఇటీవల తాను కరీంనగర్‌లో చేసిన ప్రసంగంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో... దానిపై ఎంఐఎం ముఖ్యనేత అక్బరుద్దీన్ ఓవైసీ వివరణ ఇచ్చారు. తన ప్రసంగంలో ఎలాంటి రెచ్చగొట్టే అంశాలు లేవని, ఎవరి వర్గానికి వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని వివరించారు. కొందరు వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రసంగానికి కొన్ని పదాలను జోడించి అర్థం మారేలా చేస్తున్నారని ఆరోపించారు. తన ప్రసంగం ద్వారా తాను రాజ్యాంగాన్ని ఏ రకంగానూ ఉల్లంఘించలేదని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో పర్యటించిన అక్బరుద్దీన్ ఓవైసీ... అక్కడ బీజేపీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే ఆయన ఓ వర్గాన్ని మరో వర్గంపై దాడికి ఉసిగొల్పేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

First published: July 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...