YS Family politics: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వైఎస్ఆర్ వర్ధంతి సభ హాట్ టాపిక్ అవుతోంది. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy)12వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన సతీమణీ వైఎస్ విజయలక్ష్మి (YS Vijayalaxmi)అనుకుంటున్నారు. సాధరణంగా వైఎస్‌ఆర్ వర్థంతి ప్రతి ఏటా ఇడుపుల పాయలో నిర్వహిస్తుంటారు.. కానీ ఈ సారి భిన్నంగా హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించాలని నిర్ణయించారు. వైఎస్‌ఆర్‌తో అనుబంధమున్న ప్రముఖులను ఆహ్వానించారు. 2004, 2008 వైఎస్‌ఆర్ కేబినేట్‌లో పనిచేసిన ఉభయ రాష్ట్రాల మంత్రులకు విజయలక్ష్మి ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీరిలో వైఎస్‌ఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyannarayana) కూడా ఉన్నారు. బొత్సతో పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి వెళ్లాలా వద్దా అని మంత్రులు, వైసీపీ శాసనసభ్యులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రధానంగా మంత్రుల్లో ఈ భయం బాగా కనిపిస్తోంది. వర్ధంతి సభకు సంబంధించిన ఎస్‌ఎంఎస్ తనకూ అందిందని.. అయితే విజయలక్ష్మి నేరుగా ఆహ్వానించలేదని ఓ మంత్రి తెలిపారు. నేరుగా పిలిస్తే వెళ్లాలో వద్దో అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు. మిగతా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఈ వైఎస్‌ఆర్ సంస్మరణ సభకు రావాలని వైఎస్ విజయలక్ష్మి సుమారు 300 మందికి ఆహ్వానం పంపారు. సభలో 30 మంది ప్రసంగిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. సంస్మరణ సభకు రాజకీయనేతలతో పాటూ అన్ని రంగాల ప్రముఖులకు విజయలక్ష్మి ఆహ్వానం పంపారని తెలుస్తోంది.
ప్రజాకవి గద్దర్(Gaddar)ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు సమాచారం. సినిమా రంగం నుంచి ప్రముఖ నటులు చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), సూపర్ స్టార్ కృష్ణ (super star Krishna), నిర్మాత దిల్ రాజు (dil Raju)లకు ఆహ్వానం పంపారు. అలాగే రిటైర్జ్ జడ్జి సుదర్శన్‌రెడ్డి కూడా సభకు వస్తారని చెబుతున్నారు. 2004, 2008 వైఎస్‌ఆర్ కేబినేట్‌లో పనిచేసిన ఉభయ రాష్ట్రాల మంత్రులకు విజయలక్ష్మి ఫోన్ చేసి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి మంత్రి సబిత ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), ఎంపీ డి. శ్రీనివాస్ (d srinivas, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి (sunitha laxma Reddy), ఎమ్మెల్యే దానం (Danam Nagender) నాగేందర్‌లను ఆహ్వానించారు.
ఇక కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy Brothers), జానారెడ్డి (Jana Reddy), దామోదర రాజనరసింహ (dhamodhar Rajanarsimha), గీతారెడ్డి (Geetha Reddy), దుద్దిళ్ల శ్రీదర్ బాబు (D sridhar babu) ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ జితేందర్(MP Jithendhar), డీకే అరుణ (DK Aruna)లకు ఆహ్వానం పంపారు.
మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీ ఓవైసీ Asaduddin Owaisi)ని కూడా ఆహ్వానించారు. అయితే విజయమ్మ ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ అంటే అభిమానమే, కాని సభకు రాలేనని అసద్ సమాధానం చెప్పినట్టు ఎంఐఎం నేతలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్న సమయంలో.. షర్మిలకు మద్దతుగా వెళ్తే.. రాజకీయంగా వ్యతిరేక సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఆశ్చర్యకర అంశం ఏంటంటే.. ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న కొందరు మాజీ మంత్రులను కూడా విజయమ్మ పిలిచినట్టు సమాచారం. ఇది రాజకీయ కార్యక్రమం కాదని, అందరూ రావాలని విజయలక్ష్మి కోరుతున్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ పిలిచినప్పుడు వెళ్లాలి కదా అని ఒక వర్గం భావిస్తోంది. కానీ వెళ్తే వైసీపీ, షర్మిల పార్టీ రెండూ ఒకటేనన్న సంకేతాలు వెళ్తాయేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి వైఎస్ సన్నిహితులను ఆహ్వానించడంలో తెలంగాణ ప్రాంతంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు విజయలక్ష్మి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. షర్మిల పార్టీ పెట్టడంలోను, ఆమె సభల నిర్వహణలోనూ విజయలక్ష్మి వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్‌ను మరోసారి స్ఫురణలోకి తీసుకొచ్చే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వేదికగా నిర్వహిస్తుండడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న షర్మిల.. కార్యక్రమం నిర్వహణలో తన వంతు కీలక పాత్రనూ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.