సారీ మోదీజీ..! ప్రమాణస్వీకారానికి రాలేను...మమతా బెనర్జీ లేఖ

గత ఆరేళ్లలో బెంగాల్ పంచాయతీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చెలరేగి హింసలో చాలా మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారని...వారి కుటుంబ సభ్యులను మోదీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించామని బీజేపీ నేతలు చెప్పారు.

news18-telugu
Updated: May 29, 2019, 3:39 PM IST
సారీ మోదీజీ..! ప్రమాణస్వీకారానికి రాలేను...మమతా బెనర్జీ లేఖ
ప్రధాని మోదీ, మమత బెనర్జీ
news18-telugu
Updated: May 29, 2019, 3:39 PM IST
ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం సాయంత్రం 'మై నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ' అని ప్రధానిగా ప్రమాణ్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రామానికి పలు దేశాధినేతలతో పాటు రాజకీయ పార్టీల అధ్యక్షలు హాజరవుతున్నారు. ఐతే నిన్నటి వరకు మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతానని చెప్పిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..ఒక్కరోజు ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావడం లేదని ఆయనకు లేఖరాశారు. బెంగాల్‌లో రాజకీయ హత్యలు జరిగాయన్న దుష్ప్రచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో వెల్లడించారు.

కొత్త ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు. రాజ్యాంగబద్దమైన ఆహ్వానం మేరకు ప్రమాణస్వీకర కార్యక్రమానికి హాజరవ్వాలని భావించాను. కానీ బెంగాల్‌లో రాజకీయ ఘర్షణలు చెలరేగి 54 మంది హత్యకు గురయ్యారని బీజేపీ ఆరోపిస్తున్నట్లగా గంట నుంచి మీడియాలో కథనాలు వస్తున్నాయి. అది అవాస్తవం. బెంగాల్‌లో ఎలాంటి రాజకీయ హత్యలు జరగలేదు. వ్యక్తిగత కక్షలు, కుటుంబ కలహాలు, ఇతర గొడవల వల్లే వారు చనిపోయి ఉండవచ్చు. ఆ మరణాలకు రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయ హత్యలనడానికి ఎలాంటి రికార్డులు లేవు. అందుకే ఐయామ్‌ సారీ నరేంద్రమోదీ జీ. ప్రమాణస్వీకారానికి రాలేకపోతున్నాను. ప్రమాణస్వీకారం అంటే ప్రజాస్వామ్య పండగ. రాజకీయ ప్రయోజనాల కోసం దాని విలువను తగ్గించొద్దు. దయచేసి నన్ను క్షమించండి.
మమతా బెనర్జీ, బెంగాల్ సీఎంమరోవైపు మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సుమారు 50 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది బీజేపీ. బెంగాల్‌లో హత్యకు గురైన బీజేపీ కార్యకర్తల కుటుంబీకులకు ఆహ్వానం పంపింది. గత ఆరేళ్లలో బెంగాల్ పంచాయతీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చెలరేగి హింసలో చాలా మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారని...వారి కుటుంబ సభ్యులను మోదీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించామని బీజేపీ నేతలు చెప్పారు. మోదీ కార్యకర్తల వెంట ఉన్నారన్న సందేశం ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...