MGNREGA: గోతులు తవ్వింది మీరే... ప్రధాని మోదీకి రాహుల్ చురకలు

రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ

కరోనా సమయంలో గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయని.. MGNREGAకు డిమాండ్ పెరిగిందంటూ ఓ గ్రాఫ్‌ను కూడా షేర్ చేశారు రాహుల్ గాంధీ.

  • Share this:
    ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి టార్గెట్ చేశారు. పేదలకు ఆర్థికంగా ఆదుకునే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మోదీ తక్కువ చేసి చూస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. MGNREGA కింద గ్రామాల్లో కేవలం గుంతలే తవ్వుతున్నారంటూ మోదీ చులకన చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి వారు గుంతలు తవ్వడం లేదని.. మోదీ తవ్విన ఆర్థిక సంక్షోభం గోతుల నుంచి MGNREGA ద్వారా బయటపడుతున్నారని ట్విటర్ ద్వారా చురకలంటించారు.

    MGNREGA ద్వారా ప్రజలు కేవలం గుంతలే తవ్వుతున్నారని మోదీ అంటున్నారు. కానీ నిజం ఏంటంటే, మోదీ తవ్విన ఆర్థిక సంక్షోభం గోతుల నుంచి పేదలను MGNREGA బయటకు లాగుతోంది.
    రాహుల్ గాంధీ


    కరోనా సమయంలో గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయని.. MGNREGAకు డిమాండ్ పెరిగిందంటూ ఓ గ్రాఫ్‌ను కూడా షేర్ చేశారు రాహుల్ గాంధీ. కాగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేదలకు సామాజిక భద్రతనిస్తోంది. ముఖ్యంగా కరోనా లాంటి ఈ కష్ట సమయాల్లో గ్రామాల్లోని పేదలను ఆర్థికంగా ఆదుకుంటోంది. 2005 సెప్టెంబరులో యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

    Published by:Shiva Kumar Addula
    First published: