• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • METRO MAN E SREEDHARAN TO JOIN BJP DURING PARTYS VIJAYA YATHRA IN KERALA SK

Kerala: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీలోకి మెట్రో మ్యాన్ శ్రీధరన్

Kerala: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీలోకి మెట్రో మ్యాన్ శ్రీధరన్

ఈ.శ్రీధరన్

ఈ.శ్రీధరన్ మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుంది. వృత్తిరిత్యా సివిల్ ఇంజినీరైన శ్రీధరన్.. మన దేశంలో ప్రజా రవాణా ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేశారు. ఈయన సారథ్యంలో కొంకణ్ రైల్వేతో పాటు ఢిల్లీ మెట్రో నిర్మాణం జరిగింది.

  • Share this:
    మరికొన్ని నెలల్లో రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెట్రో మ్యాన్‌గా పేర్గాంచిన ఈ.శ్రీధరన్ రాజకీయాల్లోకి వస్తున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ ప్రకటించారు. కేరళలో ఫిబ్రవరి 21 నుంచి బీజేపీ విజయ యాత్ర నిర్వహించనుంది. ఈ ర్యాలీ సందర్భంగా కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఈ.శ్రీధరన్. ఆయన బీజేపీలో చేరబోతున్నారన్న వార్త కేరళ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది.

    'ఇది ఆకస్మిక నిర్ణయం కాదు. కేరళలో దశాబ్ధ కాలంగా ఉంటున్నా. రాష్ట్ర ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నా. ఒక్కడిగా ఏమీ చేయలేను. బీజేపీ విభిన్నమైన పార్టీ. అందుకే బీజేపీలో చేరుతున్నా. వృత్తిపరమైన అంశాలను పక్కనబెట్టి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారిస్తాను.' అని మలయాళ న్యూస్ పేపర్ మనోరమతో ఆయన పేర్కొన్నారు. బీజేపీ వస్తేనే కేరళ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీచేస్తానని ఆయన ప్రకటించారు.

    ఈ.శ్రీధరన్ మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుంది. వృత్తిరిత్యా సివిల్ ఇంజినీరైన శ్రీధరన్.. మన దేశంలో ప్రజా రవాణా ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేశారు. ఈయన సారథ్యంలో కొంకణ్ రైల్వేతో పాటు ఢిల్లీ మెట్రో నిర్మాణం జరిగింది. శ్రీధరన్ గైడెన్స్‌లోనే లక్నో మెట్రో రికార్డు టైమ్‌లో పూర్తయింది. అంతేకాదు కేరళలోని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు.

    కాగా, 2017లో లక్నో మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీధరన్‌ను పట్టించుకోలేదని అప్పట్లో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన సలహాలు సూచనలతోనే లక్నో మెట్రో ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయింది. ఐతే ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదికపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్ర మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, మంత్రులు బ్రిజేష్ పాఠక్, రీటా బహుగుణ జోషి, అశుతోష్ టాండన్ కూడా పాల్గొన్నారు. ఐతే ఆ మెట్రో ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన శ్రీధరన్ మాత్రం పక్కనబెట్టారేశారని విమర్శలు వచ్చాయి. ప్రారంభోత్సవంలో శ్రీధరన్ ఓ మూలన నిల్చున్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు