#MeToo: మీటూ ఉద్య‌మం వేళ మ‌ళ్లీ తెర‌పైకి శ్రీ‌రెడ్డి..

దేశ‌మంతా ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్న మీటూ ఉద్య‌మానికి మొద‌ట్లో ఆజ్యం పోసింది శ్రీ‌రెడ్డే. అస‌లు ఈ ర‌చ్చ లేకముందే తెలుగు ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని చెప్పింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఉతికి ఆరేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 14, 2018, 12:32 AM IST
#MeToo: మీటూ ఉద్య‌మం వేళ మ‌ళ్లీ తెర‌పైకి శ్రీ‌రెడ్డి..
శ్రీరెడ్డి ఫేస్‌బుక్ ఫోటో
  • Share this:
దేశ‌మంతా ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్న మీటూ ఉద్య‌మానికి మొద‌ట్లో ఆజ్యం పోసింది శ్రీ‌రెడ్డే. అస‌లు ఈ ర‌చ్చ లేకముందే తెలుగు ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని చెప్పింది. ఇప్పుడంటే అంద‌రూ బ‌య‌టికి వ‌చ్చి ర‌చ్చ చేస్తున్నారు కానీ అంద‌రి కంటే ముందు బ‌ట్ట‌లిప్పి మ‌రి త‌న నిర‌స‌న తెలియ‌జేసింది శ్రీ‌రెడ్డి. త‌న‌ను తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా మంది వాడుకున్నార‌ని.. త‌ను కూడా చాలా మందితో ప‌డుకున్నాన‌ని.. తానేం ఇప్పుడు ప‌తివ్ర‌త అని చెప్ప‌డం లేద‌ని ఓపెన్‌గానే అన్ని నిజాలు ఒప్పుకుంది శ్రీ‌రెడ్డి.

#MeToo: మీటూ ఉద్య‌మం వేళ మ‌ళ్లీ తెర‌పైకి శ్రీ‌రెడ్డి.. #MeToo: sri reddy sensational comments on trs mla jeevan reddy.. #MeToo, sri reddy,srireddy,sensational comments on trs mla jeevan reddy,murugadoss,raghava lawrence,bellamkonda suresh,telugu cinema,trs,శ్రీరెడ్డి,శ్రీ రెడ్డి,జీవన్ రెడ్డి,టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,తెలుగు సినిమా,రాజకీయం,తెలంగాణ,కాస్టింగ్ కౌచ్,మీటూ,బెల్లంకొండ సురేష్,మురుగదాస్,లారెన్స్
శ్రీరెడ్డి ఫేస్‌బుక్ ఫోటో


ఇప్పుడు హైద‌రాబాద్ వ‌దిలేసి చెన్నైలో మ‌కాం పెట్టిన శ్రీ‌రెడ్డి.. అక్క‌డ ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. ఒక్క‌టి రెండు కాదు.. చాలా మంది పేర్లు బ‌య‌టికి చెప్పింది. అంతేకాదు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ తెలంగాణ‌ను కూడా ఈ మీటూ ప్ర‌కంప‌న‌లు తాకేసాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది శ్రీరెడ్డి. మీటూ ఉద్య‌మంలో బాగంగా తెలంగాణ‌లో ప్ర‌ముఖ రాజ‌కీయ నేత పేరు బ‌య‌ట‌పెట్టింది ఈ సంచ‌ల‌న బ్యూటీ.

#MeToo: మీటూ ఉద్య‌మం వేళ మ‌ళ్లీ తెర‌పైకి శ్రీ‌రెడ్డి.. #MeToo: sri reddy sensational comments on trs mla jeevan reddy.. #MeToo, sri reddy,srireddy,sensational comments on trs mla jeevan reddy,murugadoss,raghava lawrence,bellamkonda suresh,telugu cinema,trs,శ్రీరెడ్డి,శ్రీ రెడ్డి,జీవన్ రెడ్డి,టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,తెలుగు సినిమా,రాజకీయం,తెలంగాణ,కాస్టింగ్ కౌచ్,మీటూ,బెల్లంకొండ సురేష్,మురుగదాస్,లారెన్స్
శ్రీరెడ్డి జీవన్ రెడ్డి ఫోటోస్


ప్ర‌ముఖ త‌మిళ్ న్యూస్ చాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్యూలో శ్రీరెడ్డి ఈ రాజ‌కీయ నాయ‌కుడిపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. జీవ‌న్ రెడ్డి త‌న‌ను పార్క్ హాయ‌త్ హోట‌ల్‌లో బ‌ల‌వంతం చేశాడ‌ని.. ఆయ‌న చాలా పెద్ద అమ్మాయిల పిచ్చోడు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది శ్రీ‌రెడ్డి. అంతేకాదు.. తాము సినిమాల‌కు బ్లాక్ మ‌నీ పెడ‌తాం అని.. నువ్వు ప‌డుకుంటే అవ‌కాశాలు ఇప్పిస్తాం అని చెప్పిన‌ట్లు క‌మెంట్ చేసింది శ్రీ‌రెడ్డి. ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డికి నిర్మాత బెల్లంకొండ హెల్స్ చేశాడని మ‌రో బాంబ్ కూడా పేల్చింది ఈ ముద్దుగుమ్మ‌. అంతేకాదు.. త‌న‌కు ప్ర‌తిరోజు ఫోన్ చేసి వేధించేవాడని ఆరోప‌ణ‌లు చేసింది.

#MeToo: మీటూ ఉద్య‌మం వేళ మ‌ళ్లీ తెర‌పైకి శ్రీ‌రెడ్డి.. #MeToo: sri reddy sensational comments on trs mla jeevan reddy.. #MeToo, sri reddy,srireddy,sensational comments on trs mla jeevan reddy,murugadoss,raghava lawrence,bellamkonda suresh,telugu cinema,trs,శ్రీరెడ్డి,శ్రీ రెడ్డి,జీవన్ రెడ్డి,టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,తెలుగు సినిమా,రాజకీయం,తెలంగాణ,కాస్టింగ్ కౌచ్,మీటూ,బెల్లంకొండ సురేష్,మురుగదాస్,లారెన్స్
శ్రీరెడ్డి ఫేస్‌బుక్ ఫోటో


ఈ విష‌యంపై జీవ‌న్ రెడ్డి మాత్రం త‌న‌కు ఏ సంబంధం లేద‌ని.. నో క‌మెంట్స్ అని చెప్పిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక్క జీవ‌న్ రెడ్డి పేరు మాత్ర‌మే కాదు.. ఈ ఇంట‌ర్వ్యూలో లారెన్స్ పేరు కూడా బ‌య‌ట‌పెట్టింది శ్రీ‌రెడ్డి. త‌న‌ను తాక‌రాని చోట్ల‌లో లారెన్స్ తాకాడ‌ని.. ఇక్క‌డంతా పెద్ద మ‌నిషి ముసుగు వేసుకుని చాలా మంది చిల్ల‌ర ప‌నులు చేస్తున్నార‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి ఇప్పుడు శ్రీ‌రెడ్డి చెబుతున్న ఒక్కో పేరు వింటుంటే వ‌ణుకు పుడుతుంది అంద‌ర్లో. ఇంకా ఎవ‌రెవ‌రి పేర్లు బ‌య‌టికి వ‌స్తాయో తెలియ‌దు కానీ ఇప్ప‌టికైనా రాజ‌కీయ వేడి కూడా రాజేసింది శ్రీ‌రెడ్డి.
Published by: Praveen Kumar Vadla
First published: October 14, 2018, 12:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading