ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక... అమరావతి జేఏసీ పేరుతో వైరల్ అవుతున్న వాట్సప్ మెసేజ్...

అమరావతి పరిరక్షణ సమితి పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: January 19, 2020, 8:11 PM IST
ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక... అమరావతి జేఏసీ పేరుతో వైరల్ అవుతున్న వాట్సప్ మెసేజ్...
ఆంధ్రప్రదేశ్ మ్యాప్
  • Share this:
అమరావతి పరిరక్షణ సమితి పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఏపీలో మూడు రాజధానులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆమోదముద్ర వేయాలని వ్యూహం రచించగా, అదే రోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి అందరూ తరలిరావాలంటూ ఓ వాట్సప్ మెసేజ్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉంది.

‘రేపు కేబినెట్ తీసుకోబోయే నిర్ణయం పై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. కులం, మతం తో సంబంధం లేకుండా అందరూ ఒక్క సారి మీ మనసుతో ఆలోచించి రేపు జరగబోయే ఉద్యమానికి తరలిరండి. ఇది ఎవడి ఇంట్లో పెళ్లి కాదు,చూస్తు కూర్చోవడానికి. అందరం కలిసి పోరాడితే పోయేది ఏమి లేదు. ప్రజా ఉద్యమాలు ముందు ఎలాంటి నాయకుడు అయిన ప్రభుత్వాలు అయిన తలవంచాలిసిందే. ముఖ్యంగా రైతులను ఆడవారిని నీచంగా చూస్తున్న ఈ నాయకులకు మన రేపటి ప్రదర్శన దేశానికి ఆదర్శం కావాలి. 5000 మంది పోలీసులు 50,000 వేల మంది ప్రజలని కట్టడి చేయగలరా...! ఎవరూ ఏమీ చేయలేరు..శాంతియుతముగా ధర్నా చేయడం మన హక్కు. పోరాడి సాదించుకుందామ, లేక చేతగాని వాడి లాగా చరిత్రలో నిలిచి పోదామా? .ఈ సందేశం నీ గురించే చదివి నాకెందుకులే అనుకుంటే ఈ సమాజాన్ని ప్రశ్నలు వేసే హక్కు నీకు లేనట్లే. గ్రౌండ్ లో, కాఫీ కోట్ల దగ్గర, బార్ షాప్స్ లో సమాజం ఇలా అయిపోతుంది అని ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రం చెప్పకండి. మళ్ళీ చెప్తున్నాను, పోలీసులు ఏమి చేయలేరు. అరెస్ట్ చేస్తే చేయనియండి కాని వెనక్కి మాత్రం వెళ్లొద్దు. రేపు మన అసెంబ్లీ ముట్టడికి ఇంటికి ఒకరు చొప్పున వచ్చిన చాలు మన రాజధానిని మనం కాపాడుకునట్లే.
...జై అమరావతి.’ పేరుతో వాట్సప్ మెసేజ్ వైరల్‌గా మారింది.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు