సైన్యంపై మెహబూబా ముఫ్తీ సంచలన ఆరోపణలు : కెమికల్స్ వాడుతున్నారని..

నామరూపల్లేకుండా ముక్కలు ముక్కలైన సోదరుడి మృతదేహాన్ని చూసిన మరుక్షణం ఓ బాలుడి భావోద్వేగం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాలని మెహబూబా అన్నారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత.. అతను తుపాకీ పట్టుకుంటే ఆశ్చర్యపోతారా? అని ప్రశ్నించారు.

news18-telugu
Updated: April 17, 2019, 8:09 PM IST
సైన్యంపై మెహబూబా ముఫ్తీ సంచలన ఆరోపణలు : కెమికల్స్ వాడుతున్నారని..
మెహబూబా ముఫ్తీ (File)
news18-telugu
Updated: April 17, 2019, 8:09 PM IST
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ భారత సైన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతం చేశాక.. వారి శవాలను గుర్తించడానికి వీల్లేకుండా కెమికల్స్ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాది అయినా.. ఇంకెవరైనా.. మనిషిగా పుట్టిన ప్రతీ వ్యక్తికి చావు తర్వాత గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. సాయుధ దళాలు ఎన్‌కౌంటర్స్ తర్వాత మృతదేహాలపై కెమికల్స్ ప్రయోగించి.. శవాలను గుర్తుపట్టకుండా చేయడం అమానవీయమైన చర్య అన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని శాంగస్ ప్రాంతంలో మెహబూబా ముఫ్తీ బుధవారం మీడియాతో మాట్లాడారు.

నామరూపల్లేకుండా ముక్కలు ముక్కలైన సోదరుడి మృతదేహాన్ని చూసిన మరుక్షణం ఓ బాలుడి భావోద్వేగం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాలని మెహబూబా అన్నారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత.. అతను తుపాకీ పట్టుకుంటే ఆశ్చర్యపోతారా? అని ప్రశ్నించారు. ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ నేత కవీందర్ గుప్తా స్పందించారు. ముఫ్తీ హయాంలోనే కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఎక్కువగా జరిగిందన్నారు. సైన్యం కెమికల్స్ ఉపయోగించిందా? లేదా? అన్నది ఆమెకే తెలియాలి అని ఆయన అన్నారు. ముఫ్తీ కామెంట్స్‌ను ఎలక్షన్ జిమ్మిక్ అని కొట్టిపారేశారు. వార్లల్లో నిలవడానికే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

ఇదే విషయంపై పీడీపీ నేతలతో న్యూస్18 మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అందుకు వారు తిరస్కరించారు. కాగా, కశ్మీర్‌లోని సాయుధ దళాలు కెమికల్ ప్రయోగిస్తున్నాయన్న ఆరోపణలు చాలాసార్లు వినిపించాయి. కానీ సైన్యం మాత్రం ఆరోపణలను ఖండిస్తూనే ఉంది. జెనీవా ప్రోటోకాల్ ప్రకారం సాయుధ దళాలు కెమికల్స్ ఉపయోగించడం నిషిద్ధం. మెహబూబా ముఫ్తీ సీఎంగా ఉన్న కాలంలో సాయుధ దళాల చేతిలో హతమైన ఎంతోమంది ఉగ్రవాదుల మృతదేహాలు గుర్తించడానికి వీల్లేకుండా ఉండేవి.First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...