రాజధానిపై యూటర్న్ తీసుకోలేదు.... క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఇవ్వలేదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: December 23, 2019, 7:49 AM IST
రాజధానిపై యూటర్న్ తీసుకోలేదు.... క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
చిరంజీవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ
  • Share this:
చిరంజీవి రెండు రోజుల క్రితం జగన్ మూడు రాజధానుల ప్రకటనకు మద్దతిస్తూ... వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత చిరంజీవి ఏపీ రాజధానుల అంశంపూ యూటర్న్ తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఇవ్వలేదంటూ న్యూస్ వైరల్ అయ్యింది. చిరంజీవి పేరుతో ఉన్న ఓ లెటర్ హెడ్ మీద తాను మూడు రాజధానులకు మద్దతిస్తున్నట్టుగా కానీ, వ్యతిరేకిస్తున్నట్టుగా కానీ ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయంపై మెగాస్టార్ స్పందించారు. తన పేరు మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ఆ ప్రకటన అవాస్తవమన్నారు చిరు.

తాను విడుదల చేయలేదని, అది నకిలీదని చిరంజీవి స్పష్టం చేశారు. ఆ ప్రకటనను నమ్మవద్దని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనను చిరంజీవి స్వాగతించడంతో ఆయనపై విమర్శల జడివాన మొదలైంది. దీంతో వెనక్కి తగ్గిన చిరంజీవి తాను అలాంటి ప్రకటన చేయలేదని చెబుతూ మరో ప్రకటన విడుదల చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అని కొట్టి పారేశారు మెగాస్టార్. ‘‘నేనిప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నా. మూడు రాజధానుల అంశంపై సమర్థిస్తూ కానీ, వ్యతిరేకిస్తూ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు’’ అని చిరంజీవి పేర్కొన్నట్టు నిన్న సోషల్ మీడియాలో ఓ ప్రకటన చక్కర్లు కొట్టింది. దీంతో మరోమారు స్పందించిన చిరంజీవి.. ఆ ప్రకటన అవాస్తవమని వివరణ ఇచ్చారు. మూడు రాజధానులను సమర్థిస్తూ శనివారం విడుదల చేసిన ప్రకటన మాత్రమే నిజమన్నారు చిరు.  ఏపీకి మూడు రాజధానులంటూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతిస్తున్నానన్నారు.

First published: December 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు