ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి భేటి పై సర్వత్రా ఆసక్తి..

గత కొన్నేళ్లుగా చిరంజీవి పూర్తిగా రాజకీయాలను పక్కనపెట్టి.. సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు. తాజాగా చిరంజీవి.. ఉన్నట్టుండి ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరికొన్ని గంటల్లో వీళ్లిద్దరు భేటి కానున్నారు.

news18-telugu
Updated: October 13, 2019, 9:42 PM IST
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి భేటి పై సర్వత్రా ఆసక్తి..
మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్(ఫైల్ ఫోటోలు)
  • Share this:
గత కొన్నేళ్లుగా చిరంజీవి పూర్తిగా రాజకీయాలను పక్కనపెట్టి.. సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు. తాజాగా చిరంజీవి.. ఉన్నట్టుండి ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా చిరంజీవికి అక్టోబర్ 11న అపాయింట్‌మెంట్ ఇచ్చిన ఏపీ సర్కార్.. ఆ తర్వాత 14కు పోస్ట్ పోన్ చేసింది. ఈ సోమవారం లంచ్ బ్రేక్‌లో ఏపీ ముఖ్యమంత్రిని ఆయన క్యాంప్ కార్యాలయంలో చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కలవనున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఏం మాట్లాడుకుంటారు అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ వీరిద్దరి భేటిలో ఎలాంటి రాజకీయా కోణాలు లేవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి  అంతగా మద్దతు రాలేదు.

YS Jagan Chiranjeevi meeting,Chiranjeevi YS Jagan meeting,Megastar meeting with CM Jagan,Megastar chiranjeevi appointment with Chiranjeevi,Auto Rajini Movie,Jagan clap to auto rajini movie,జగన్ చిరంజీవి భేటీ,చిరంజీవి జగన్ భేటీ,చిరంజీవికి జగన్ అపాయింట్‌మెంట్,ఆటో రజిని సినిమా,ఆటో రజిని సినిమా,ఆంధ్రప్రదేశ్ న్యూస్,ఏపీ వార్తలు,చిరంజీవి లేటెస్ట్ న్యూస్,Chiranjeevi jagan latest news,
చిరంజీవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ


ఈ భేటీలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చిరంజీవి, రామ్ చరణ్‌లు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోదుడు సైరా నరసింహారెడ్డి సినిమాను చూడాలని కోరనున్నారు చిరంజీవి, రామ్ చరణ్. ఈ సినిమాకు ఏపీలో ప్రత్యేక షోలు వేసేందకు జగన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి.. జగన్‌ను కలిసింది లేదు. ఈ సందర్భంగా  ఏపీ సీఎంగా జగన్ ఎన్నికైనందకు ఆయన్ని కలిసి  చిరంజీవి, రామ్ చరణ్ అభినందనలు తెలపనున్నారు. మరోవైపు ఈ సినిమాకు ఏపీలో పన్ను మినహాయింపు కోరనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి భేటి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా స్పెషల్ షో వేసి చూపించారు చిరంజీవి. ఆ సినిమాను చూసిన తెలంగాణ గవర్నర్ ఈ సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 13, 2019, 9:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading