బీజేపీ ముఖ్య నేతతో కలిసి ఢిల్లీకి చిరంజీవి

చిరంజీవి వెళ్తున్న ఫ్లైట్లోనే ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ కూడా ఉన్నట్లు సమాచారం.

news18-telugu
Updated: October 16, 2019, 3:32 PM IST
బీజేపీ ముఖ్య నేతతో కలిసి ఢిల్లీకి చిరంజీవి
చిరంజీవి (Image : File)
news18-telugu
Updated: October 16, 2019, 3:32 PM IST
మెగాస్టార్ చిరంజీవి హస్తిన బాట పట్టారు. సైరా సినిమాను ఇవాళ ఉపరాష్త్రపతి వెంకయ్యనాయుడు వీక్షంచే అవకాశం ఉండటంతో చిరు ఆయన ఇంటికి వెళ్లనున్నారు. అయితే చిరు వెళ్తున్న విమానంలోనే... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఉండటంతో.. చిరు పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాంమాధవ్‌తో అదే ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా ఉన్నారు. దీంత చిరు పర్యటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలయ్యింది. మరోవైపు సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో సైరా సినిమా ప్రదర్శన చేయనున్నారు. సైరా చూడాలని చిరు ప్రధానిని కూడా కలిసి అడిగే అవకాశాలున్నట్లు చిరంజీవి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కూడా తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ఉపరాష్ట్రపతితో పాటు మరికొందరు ఢిల్లీ పెద్దలు కూడా సైరా సినిమాను చూస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవికూడా చదవండి:
సెల్ ఫోన్ దొంగను చితక్కొట్టిన అమ్మాయిలు



First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...