హోమ్ /వార్తలు /politics /

Chiranjeevi Tweet to YS Jagan: సినిమా టికెట్లపై పునారాలోచించండి.. సీఎం జగన్ కు మెగాస్టార్ ట్వీట్..

Chiranjeevi Tweet to YS Jagan: సినిమా టికెట్లపై పునారాలోచించండి.. సీఎం జగన్ కు మెగాస్టార్ ట్వీట్..

దీనిలో భాగంగా కోవిడ్ ఆంక్షలను పాటిస్తూనే.. కొంతమంది సినిమా పెద్దలకు సీఎం జగన్ కలవాలి అంటూ మంత్రి పేర్ని నాని ఆహ్వానం పంపారు. మరి కాసేపట్లో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు సినిమా పెద్దలు చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు టాలీవుడ్  బృందం బయలు దేరింది.

దీనిలో భాగంగా కోవిడ్ ఆంక్షలను పాటిస్తూనే.. కొంతమంది సినిమా పెద్దలకు సీఎం జగన్ కలవాలి అంటూ మంత్రి పేర్ని నాని ఆహ్వానం పంపారు. మరి కాసేపట్లో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు సినిమా పెద్దలు చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు టాలీవుడ్ బృందం బయలు దేరింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) సినిమా ఆన్ లైన్లో సినిమా టికెట్ల (Online Movie Tickets System) విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేస్తూ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. సీఎం జగన్ (AP CM YS Jagan) కు ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఆన్ లైన్ మూవీ టికెటింగ్ విధానాన్ని (Online Movie Tickets Issue) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేస్తూ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. కొత్త చట్టం అమల్లోకి రావడంతో రాష్ట్రంలో సినిమా టికెట్ల విక్రయం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరగనుంది. అలాగే రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయడంతో పాటు ఏ సినిమాకైనా టికెట్ల ధరలు పెంచేది లేదని.. అన్నింటికీ ఒకేలా ఉంటాయని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. స్పెషల్ షోలు, టికెట్ ధరలను పెంచడం వంటి వాటికి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. అలాగే పన్ను ఎగవేతకు కూడా అవకాశం లేకుండా పారదర్శకతతో నూతన విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై టాలీవుడ్ నుంచి ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. ఐతే మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi) మాత్రం ట్విట్టర్లో స్పందించారు.

టికెట్ ధరల నియంత్రణపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి... ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. “పరిశ్రమ కోరిన విధంగా పారదర్శతక కోసం ఆన్ లైన్ టికెటింగ్ బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ వియం. అదేవిధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆదారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుదెరువు కోసం, తగ్గించిన టికెట్ రేట్స్ ని కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని స్టేట్స్ లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా ట్యాక్సులను ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయమై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది.“ అని చిరు ట్వీట్ చేశారు.

ఇది చదవండి: RRR, భీమ్లానాయక్ కు జగన్ సర్కార్ షాక్.., పెద్ద సినిమాలకు నష్టాలు తప్పవా..?


ఇదిలా ఉంటే ఏపీలో సినిమా టికెట్ల విక్రయం, టికెట్ ధరల నియంత్రణకు సంబంధించిన బిల్లును బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఆన్ లైన్ మూవీ టికెట్ బుకింగ్ విధానం అందరికీ అందుబాటులో, సౌకర్యవంతంగా ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ముబైల్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ ద్వారా ప్రజలు తమకు నచ్చిన సినిమా టికెట్లు బుక్ చేసుకునే అవకాశముందని పేర్కొంది.

ఇది చదవండి: జూ.ఎన్టీఆర్ తో స్నేహంపై కుండబద్దలు కొట్టిన కొడాలి నాని.. నందమూరి కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు..


ప్రజలు సినిమా హాళ్ల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడే సమయాన్ని ఆదా చేయడానికి ఈ ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. తాము తీసుకొచ్చే ఈ విధానం బ్లాక్ టికెట్ల దందాకు చెక్ పెడుతుందని.. అలాగే ప్రభుత్వానికి పన్ను ఎగవేసేవారి సంఖ్యను కూడా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నిర్ణీత గడువులోగా జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ వంటి పన్నులను వసూలు చేయడం మరింత సులభమవుతుందని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chiranjeevi, Megastar Chiranjeevi, Tollywood

ఉత్తమ కథలు