పవన్ కల్యాణ్‌కు షాక్... జగన్‌కు జైకొట్టిన చిరంజీవి

రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారని చిరు కొనియాడారు.

news18-telugu
Updated: December 21, 2019, 4:04 PM IST
పవన్ కల్యాణ్‌కు షాక్... జగన్‌కు జైకొట్టిన చిరంజీవి
చిరంజీవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ
  • Share this:
అధిార పరిపాలన వికేంద్రీకణతో అభివృద్ధి సాధ్యంమన్నారు మెగాస్టార్ చిరంజీవి. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారని చిరు కొనియాడారు. రాష్ట్రం విషయంలో నిఫుణుల కమిటీ సిఫారసులు సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయన్నారు.ఇప్పటికే రాష్ట్రం మూడు లక్షలకోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. అమరావతిని నిర్మించాలంటే మరో లక్ష కోట్లు అవసరం పడతాయన్నారు. అమరావతిని నిర్మిస్తే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటన్న ఆందోళన ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికార కేంద్రీకరణ వల్ల ఆర్థిక, సామాజిక సమతుల్యత దెబ్బతిన్నాయన్నారు చిరంజీవి. ఉమ్మడి ఏపీలో పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందన్నారు.

మరోవైపే జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఏంటని పవన్ ప్రశ్నిస్తున్నారు. రాజధాని రైతులు మూడు పంటలు పండే తమ పొలాలను అమరావతి కోసం ఇచ్చారని తెలిపారు పవన్ కల్యాణ్. ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్ర భవిష్యత్ కోసమే ఇదంతా చేశారని గుర్తుచేశారు. కానీ వైసీపీ వచ్చీ రాగానే రాజధానిపై గందరగోళం సృష్టించిందని.. అసెంబ్లీలో జగన్ ప్రకటనతో రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు పవన్ కల్యాణ్. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు వేచిచూద్దామని.. అందులో పొందుపరిచిన నిర్ణయాలను బట్టి స్పందిద్దామని రైతులు, జనసేన కార్యకర్తలకు ఆయన సూచించారు. ఓవైపు పవన్ జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతుంటే... మరోవైపు పవన్ అన్న చిరంజీవి మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Published by: Sulthana Begum Shaik
First published: December 21, 2019, 3:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading