దిశా చట్టంపై మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్..

న్యాయ ప్రక్రియ(సీర్పీసీ-క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) సవరించడం ద్వారా 4 నెలలు అంతకంటే ఎక్కువ పట్టే విచారణ సమయాన్ని 21 రోజులకు కుదించడం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటును అభినందిస్తున్నట్టు తెలిపారు.

news18-telugu
Updated: December 12, 2019, 10:56 AM IST
దిశా చట్టంపై మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్..
మెగాస్టార్ చిరంజీవి (File Photo)
  • Share this:
దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళా భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశా చట్టం-2019 తీసుకురావాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ చట్టాన్ని స్వాగతిస్తూ మాజీ కేంద్రమంత్రి,హీరో చిరంజీవి స్పందించారు. మహిళా సోదరిమణులకు,లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారులకు ఈ చట్టం భరోసా ఇస్తుందన్న ఆశ తనలో ఉందన్నారు.దిశా సంఘటన అందరిని కలచివేసిందని.. అప్పటి భావోద్వేగాలు తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయని గుర్తుచేశారు.అయితే తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితం ఇస్తుందన్న నమ్మకం అందరిలో ఉందన్నారు.అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి అడుగులు వేయడం హర్షనీయం అన్నారు.

న్యాయ ప్రక్రియ(సీర్పీసీ-క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) సవరించడం ద్వారా 4 నెలలు అంతకంటే ఎక్కువ పట్టే విచారణ సమయాన్ని 21 రోజులకు
కుదించడం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటును అభినందిస్తున్నట్టు తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో మహిళలపై కించపరిచే పోస్టింగ్స్

చేస్తే తీవ్రమైన శిక్షలు,చిన్నారులపై లైంగిక దాడులకు జీవిత ఖైదు వంటివి నేర ఆలోచన ఉన్నవారిలో భయం కలిగిస్తాయన్నారు. ఈ చర్యలతో మహిళా లోకం నిర్భయంగా,స్వేచ్చగా ఉండగలుగుతున్న నమ్మకం తనకు ఉందన్నారు.ఇది కూడా చదవండి : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే : దిశా చట్టం,ప్రజా రవాణా శాఖ ఏర్పాటు
First published: December 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>