news18-telugu
Updated: October 14, 2019, 4:35 PM IST
సీఎం జగన్తో చిరంజీవి భేటీ (File)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. భార్య సురేఖతో కలిసి సీఎం జగన్ ఇంటికి వెళ్లారు. తాడేపల్లిలో జగన్ నివాసంలో చిరు దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు.. జగన్ దంపతులు. సీఎం జగన్, భార్య భారతి చిరంజీవి దంపతులను ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా జగన్ చిరంజీవి ఏం చర్చించారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ వర్గాల్లో ఈ భేటీపై ఆసక్తికర చర్చ కొనసాగింది. చిరంజీవి జగన్ ఇంటికి చేరుకోగానే సీఎంకు షాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జగన్ సతీమణి భారతికి చీర అందించారు. మరోవైపు జగన్ కూడా చిరంజీవికి వీణను బహుమతిగా ఇచ్చారు.
గంట పాటు చిరంజీవి, జగన్ బేటీ జరిగింది. భేటీ ముగిసిన తరువాత చిరంజీవి తిరుగు ప్రయాణమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే అక్టోబర్ 2వ తేదీన విడుదలైన చిరంజీవి ‘సైరా’ నరసింహారెడ్డి సినిమా గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. లంచ్ చేసే సమయంలో సైరా సినిమా గురించి సీఎం జగన్కు తెలియని విషయాల గురించి చిరు చర్చించినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో సీఎం జగన్ సైరా సినిమాను చూసే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సైరా సినిమా చూసేందుకు జగన్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. విజయవాడలో పీవీపీ మాల్ లో జగన్ సినిమా చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు చిరంజీవి సీఎం జగన్ ను వినోదపు పన్ను మినహాయింపు గురించి కూడా కోరినట్లు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ వినోదపు పన్ను విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
Published by:
Sulthana Begum Shaik
First published:
October 14, 2019, 4:35 PM IST