చిరంజీవి బీజేపీలో చేరతారా..? కమలం పార్టీ నేతల రియాక్షన్ ఇదీ..

Megastar Chiranjeevi: దివంగత సీఎం ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడు మెగాస్టార్ చిరంజీవినేనని మాజీ మంత్రి మాణిక్యాల రావు అన్నారు. ఆయన బీజేపీలోకి వస్తామంటే రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతామని చెప్పారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 26, 2019, 12:56 PM IST
చిరంజీవి బీజేపీలో చేరతారా..? కమలం పార్టీ నేతల రియాక్షన్ ఇదీ..
కొరటాల శివ సినిమాలో చిరంజీవి మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నాడా ?
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేరతారా? ఇన్నాళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన కాషాయ జెండాను భుజాన ఎత్తుకుంటారా? అందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయా? అంటే ప్రస్తుత పరిణామాలు పాజిటివ్ సంకేతాలను చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమలం పార్టీ నేతలు చిరంజీవి చేరికపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడు మెగాస్టార్ చిరంజీవినేనని మాజీ మంత్రి మాణిక్యాల రావు అన్నారు. ఆయన బీజేపీలోకి వస్తామంటే రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతామని చెప్పారు. ఆయన తమ పార్టీలో చేరాలనుకుంటే ఆయన నిర్ణయాన్ని తాము సంతోషంగా స్వాగతిస్తామని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఉన్నతమైన విలువలు, ప్రజాదరణ కలిగిన నేత అని, ఆయన లాంటి నేతలు బీజేపీలోకి వస్తే స్వాగతించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తాను చిరంజీవితో ఎలాంటి చర్చలు చేపట్టలేదని, ఇప్పటి వరకు మాట్లాడలేదన్నారు.చిరంజీవికి ఏపీలో విశేష ఆదరణ ఉందని, అన్ని వర్గాల ప్రజలు చిరంజీవిని అభిమానిస్తుంటారని మాణిక్యాలరావు తెలిపారు. చిరంజీవి ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉందని అందువల్ల ఆయన బీజేపీలోకి వస్తే మంచిదేనన్నారు.

మరోవైపు, చిరంజీవి కాషాయ గూటికి వెళతారంటూ రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. బీజేపీలో చేరాలని కొంతమంది కీలక నేతలు చిరంజీవితో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆయన బీజేపీలో చేరితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు కీలక పదవి ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, చిరంజీవి కమలం గూటికి వెళ్లేది, లేదని తేలాల్సి ఉంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 26, 2019, 12:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading