ఏపీ మంత్రి కన్నబాబును పరామర్శించిన చిరంజీవి..

ఏపీ మంత్రిని కన్నబాబును ఓదార్చతున్న చిరంజీవి (ట్విట్టర్ ఫోటో)

ఏపీ క్యాబినేట్ మంత్రి కురసాల కన్నబాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సురేష్ బాబు (46) ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. ఇక సోదరుడి మరణంతో విషాదంలో ఉన్న ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి  పరామర్శించారు.

  • Share this:
    ఏపీ క్యాబినేట్ మంత్రి కురసాల కన్నబాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సురేష్ బాబు (46) ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కన్నబాబును పరామర్శించారు. సోదరుడు అకాల మరణంతో ఈ రోజు అసెంబ్లీలో ఆయన ప్రవేశ పెట్టాల్సిన వ్యవసాయ బడ్జెట్‌ను బొత్స సత్యనారాయణ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక సోదరుడి మరణంతో విషాదంలో ఉన్న ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి  పరామర్శించారు. విజయవాడలో బుధవారం రాత్రి అకస్మాతుగా గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూసారు. దీంతో శోకసంద్రంలో మునిగిపోయిన కురసాల కన్నబాబు కుటుంబాన్ని చిరంజీవి పరామర్శించారు. కాకినాడలోని కన్నబాబు నివాసానికి వెళ్లి.. వారిని ఓదార్చారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు ఆయన వెన్నంటి ఉన్నారు కన్నబాబు. అంతేకాదు ఆ  పార్టీ తరుపున 2009లో కన్నబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక కన్నబాబు సోదరుడు.. కళ్యాణ్ కృష్ణ ప్రముఖ తెలుగు దర్శకుడు. ఈయన నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా తెరకెక్కించి తొలి సినిమాతోనే విజయం సాధించాడు. ఆ తర్వాత చైతూతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’, రవితేజతో ‘నేల టిక్కెట్టు’ సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ ..నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్నినాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు.
    First published: