పవన్‌ను పట్టించుకోని చిరంజీవి సన్నిహితుడు... మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

ఎవరు వచ్చినా రాకపోయినా... మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావు జనసేన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి వస్తారని చాలామంది అనుకున్నారు.

news18-telugu
Updated: November 4, 2019, 6:59 PM IST
పవన్‌ను పట్టించుకోని చిరంజీవి సన్నిహితుడు... మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
పవన్ కళ్యాణ్
  • Share this:
టీడీపీలోని అనేక మంది నేతలు ఆ పార్టీలో ఉంటారా ? లేక వేరే పార్టీలోకి వెళతారా ? అనే అంశంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీని వీడతారని ప్రచారం జరుగుతుండగా... విశాఖ జిల్లాకు చెందిన మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఖండించిన గంటా శ్రీనివాసరావు... టీడీపీ వ్యవహారాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చంద్రబాబు ఆదేశాలను గంటా శ్రీనివాసరావు పట్టించుకోలేదని న్యూస్ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.

విశాఖలో జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి చంద్రబాబు దూరంగా ఉన్నా... టీడీపీ సీనియర్ నేతలు, మాజీమంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ నేతలు లాంగ్ మార్చ్‌కు వచ్చారు. అయితే విశాఖలో ఉన్న మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం ఈ లాంగ్ మార్చ్‌కు దూరంగా ఉండిపోయారని తెలుస్తోంది. చంద్రబాబు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా... గంటా మాత్రం ఈ కార్యక్రమానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Ganta srinivasa rao, pawan kalyan, janasena, janasena party, ganta ignores pawan kalyan, ganta ignores chandrababu, Megastar chiranjeevi, janasena long march, chandrababu naidu, tdp, ysrcp, ap news, ap politics, గంటా శ్రీనివాసరావు, పవన్ కళ్యాణ్, జనసేన, జనసేన పార్టీ, పవన్‌ను పట్టించుకోని గంటా, చంద్రబాబును పట్టించుకోని గంటా, మెగాస్టార్ చిరంజీవి, జనసేన లాంగ్ మార్చ్, చంద్రబాబునాయుడు, ఏపీ న్యూస్, ఏపీ పాలిటిక్స్
గంటా శ్రీనివాసరావు(ఫైల్ ఫోటో)


ఎవరు వచ్చినా రాకపోయినా... మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావు జనసేన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి వస్తారని చాలామంది అనుకున్నారు. కానీ... గంటా మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. అయితే ఈ సమావేశానికి అయ్యన్నపాత్రుడు హాజరుకావడం వల్లే గంటా శ్రీనివాసరావు లాంగ్ మార్చ్‌కు డుమ్మా కొట్టారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు గంటా శ్రీనివాసరావు డుమ్మా కొట్టడం... అటు టీడీపీతో పాటు ఇటు మెగా అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారిపోయింది.
First published: November 4, 2019, 6:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading