ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రస్తుతం సినిమాలు (Tollywood), రాజకీయాలు (AP Politics) మెగాఫ్యామిలీ (Mega Family) చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiraneevi) పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పర్యటనకు ఒకరోజు ముందు అంటే అక్టోబర్ 1న (October 1st) చిరు రాజమండ్రి (Rajahmundry) వెళ్తున్నారు. రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య (Allu Rama Lingaiah) హోమియోపతి వైద్య కళాశాల, ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించనున్నారు. ఉదయం 10.35 గంటలకు చిరంజీవి మధురవాడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట మధ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్, చిరంజీవి రాష్ట్రయుత రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. గతంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో హోమియోపతి కళాశాల కొత్త భవనానికి రూ.2కోట్లు కేటాయంచారు.
మంత్రులు, ఎంపీ హాజరు...
చిరంజీవి రాజమండ్రి పర్యటనలో వైసీపీ మంత్రులు, నేతలు పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణలో మంత్రులు కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పినిపే విశ్వరూపం, ఎంపీలు పిల్లు సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్ రామ్ తో పాటు పలువులు ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు వైసీపీకి-జనసేనకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో చిరంజీవి పర్యటనకు మంత్రులు, ఎంపీలు హాజరవుతుండటం హాట్ టాపిక్ గా మారింది.
పవన్ శ్రమదానం...
ఇక అక్టోబర్ 2వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రిలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో రోడ్ల సమస్యకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగంగా ఆయన జనసేన ఆధ్వర్యంలో జరిగే శ్రమదానంలో పాల్గొంటున్నారు. అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతుల కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. ఐతే కాటన్ బ్యారేజీపై శ్రమదానానికి అనుమతులు లేవని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ ఆర్ అండ్ బీ పరిదిలోకి రాదని స్పష్టం చేశారు.
ఇక రెండు రోజుల వ్యవధిలో మెగాస్టార్, పవర్ స్టార్ రాజమండ్రి వస్తుండటం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు పాల్గొంటుండగా.. పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇటీవల సినీపరిశ్రమ విషయంలోనూ చిరంజీవి-పవన్ వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సినీఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించాలని లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటలో చిరంజీవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా.. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న పవన్ కల్యాణ్ అందుకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రవిమర్శలు చేశారు. సీఎం జగన్ తో పాటు మంత్రులపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Megastar Chiranjeevi, Pawankalyan, Rajahmundry S01p08