నాగబాబు... చింపాంజీతో పోల్చిన ఆ నేత ఎవరు?

నాలుగు చింపాంజీల ఫొటోలను నాగబాబు పోస్ట్ చేశారు. వాటి తలమీద జుట్టు, ఒంటి మీద జుట్టు అంతా తెల్లబడి ఉంది.

news18-telugu
Updated: December 8, 2019, 6:07 PM IST
నాగబాబు... చింపాంజీతో పోల్చిన ఆ నేత ఎవరు?
ట్విట్టర్‌లో నాగబాబు పోస్ట్ చేసిన చింపాంజీ ఫొటో
  • Share this:
మెగాబ్రదర్ నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ వేదికగా ఓ దుమారం రేపారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో నాలుగు చింపాజీల ఫొటోలు పోస్ట్ చేశారు. దానికంటే ముందు ఓ కామెంట్ పోస్ట్ చేశారు. ‘జుట్టు తెల్లబడ్డ ప్రతి ఎటూ కానీ వాడు పెద్ద మనిషి అనుకొని భ్రమ పడ్డా. ప్రజలు నన్ను క్షమించాలి. ఆ పెద్ద మనిషి పేరు, ఆచూకీ ఫోటో తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును.’ అని కామెంట్ చేశారు. ఆ వెంటనే నాలుగు చింపాంజీల ఫొటోలు పోస్ట్ చేశారు. అవన్నీ కూడా జుట్టు, ఒంటి మీద జుట్టు అంతా తెల్లబడి ఉంది. అయితే, ఏ రాజకీయ నేతను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే సందేహం రాజకీయవర్గాల్లో వచ్చింది. అయితే, నాగబాబు ఫొటోలు పోస్ట్ చేసిన తర్వాత దానికి కొన్ని రియాక్షన్స్ వచ్చాయి. అందులో కొందరు పవన్ కళ్యాణ్ ఫొటోలను పో్ట్ చేస్తే.. చాలా మంది విజయసాయిరెడ్డి తెల్లజుట్టుతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>