MEETING OVER CONGRESS PARTY NEW PRESIDENT WILL RAHUL GANDHI TAKE CHARGE MKS
Congress: డిసెంబర్లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. రాహుల్ గాంధీ మనసు మారేనా?
రాహుల్ గాంధీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ సరళి, ఫలితాల అంచనా తదిర అంశాలతోపాటు పార్టీకి జాతీయ అధ్యక్షుడి ఎంపికపైనా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కీలక సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో ఎంపీ రాహుల్ గాంధీ ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం ఆదివారం జరిగింది.
అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ సరళి, ఫలితాల అంచనా తదిర అంశాలతోపాటు పార్టీకి జాతీయ అధ్యక్షుడి ఎంపికపైనా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కీలక సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో ఎంపీ రాహుల్ గాంధీ ఇంట్లో కాంగ్రెస్ కీలక నేతల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఛత్తీస్గఢ్ సీఎం బాఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ పాల్గొన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల సరళి, ఓటింగ్ శాతంతో పాటు ఫలితాల తర్వాత ఏర్పడే పరిస్థితులపై కూడా ఓ అంచనాకు వచ్చామని సీఎం భూపేశ్ బాఘేల్ తెలిపారు. రాజస్థాన్ సీఎం గెహ్లోత్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించే విస్తృతంగా చర్చించామని తెలిపారు. దేశంలో ప్రతిపక్ష పార్టీ అంటే ఒక్క కాంగ్రెస్సేనని, ప్రజలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక డిసెంబర్ లో వుంటుందని పేర్కొంటున్నారు. డిసెంబర్ మాసంలో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరుగుతుందని, అప్పుడే కొత్త అధ్యక్ష ఎంపిక చేపట్టాలన్న నిర్ణయం కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ శ్రేణులంతా రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా ఉండాలని కోరుతుండగా, ఆయన మనసు మార్చుకుంటారా? లేదా? వెల్లడికావాల్సి ఉంది.
ఇక ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఐదు రాష్ట్రాల కార్యకర్తలు, నేతలు అత్యంత అప్రమత్తతో ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ సూచించినట్లు సమాచారం. కౌంటింగ్ సెంటర్ల దగ్గర కార్యకర్తలు అప్రమత్తతతో ఉండాలని సూచించారు. పార్టీ బాధ్యులందరూ ఎప్పటికప్పుడు ఫలితాల సరళిని పర్యవేక్షిస్తూ ఉండాలని రాహుల్ సూచించినట్లు తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.