MEDIATORS IN AYODHYA CASE GET TIME TILL AUGUST 15 TO FIND FRIENDLY SOLUTION BS
అయోధ్య వివాదం: మధ్యవర్తుల కమిటీకి మరింత గడువిచ్చిన సుప్రీం కోర్టు
మధ్యవర్తిత్వ కమిటీకి గడువు పొడిగింపు
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ , జస్టిస్ బోబ్డే, చంద్రచూడ్, అశోక్‌భూషణ్, అబ్దుల్ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 వరకు గడువు ఇస్తూ సమయాన్ని పొడిగించింది.
అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ మధ్యంతర నివేదికను న్యాయమూర్తులు పరిశీలించారు. అయితే పరిష్కారం కనుగొనేందుకు మరింత సమయం కావాలని కమిటీ కోరగా అందుకు కోర్టు సమ్మతించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ , జస్టిస్ బోబ్డే, చంద్రచూడ్, అశోక్‌భూషణ్, అబ్దుల్ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 వరకు గడువు ఇస్తూ సమయాన్ని పొడిగించింది. అయితే, ఇప్పటి వరకు జరిగిన మధ్యవర్తిత్వంపై నివేదిక అంశాలను బయటికి చెప్పబోమని, అది రహస్యమని సీజేఐ రంజన్ గొగోయ్ తెలిపారు.
Ayodhya matter: Three-members Mediation panel seeks extension of time to find an amicable solution. Supreme Court grants time till August 15. CJI also says, "we're not going to tell you what progress has been made, that’s confidential" pic.twitter.com/XRLTS0lorc
కాగా, అయోధ్య భూవివాదంలో శాశ్వత పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేస్తూ మార్చి 8న సుప్రీం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా వ్యవహరించనున్నారు. నాలుగు వారాల్లోగా కమిటీ స్టేటస్ రిపోర్ట్ పూర్తి అవ్వాలని, ఎనిమిది వారాల్లోగా ప్రొసీడింగ్స్ పూర్తి అవ్వాలని అప్పట్లో సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించేందుకు తమకు ఇంకా సమయం కావాలని కమిటీ కోరడంతో సుప్రీం దానికి అంగీకరించింది.
రామజన్మభూమి-బాబ్రీమసీదు స్ధలంలో వివాదాస్పదమైన 2.77 ఎకరాలను నిర్మోహి అఖారా, ఉత్తరప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు , రామ్‌లల్లా విరాజ్‌మన్‌ల మధ్య పంచాలని అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు అయోధ్యలో సేకరించిన వివాదాస్పదం కాని 67.703 ఎకరాల మిగులు భూమిని వాటి యజమానులకు తిరిగి అప్పగించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం అప్పీల్‌ను నిర్మోహి అఖారా వ్యతిరేకిస్తోంది.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.