టీటీడీ ఆస్తులు అమ్మితే జగన్‌కి, నాకు రూపాయి కూడా రాదు... ఏపీ మంత్రి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan)

టీటీడీ ఆస్తులను ప్రభుత్వం అమ్మివేస్తుందంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.

  • Share this:
    టీటీడీ ఆస్తులను ప్రభుత్వం అమ్మివేస్తుందంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయంలో టీటీడీ చైర్మన్ గా ఉన్నచదలవాడ కృష్ణమూర్తి, భాను ప్రకాష్ రెడ్డి సభ్యులుగా వున్నప్పుడే టీటీడీ లో ఉపయోగం లేని భూములను వేలం వేసేలా ఒక కమిటీ వేశారని ఆయన గుర్తు చేశారు. వారు 50 రకాల ఆస్తులను అమ్మలని గుర్తించారని చెప్పారు. జగన్ వచ్చాక టీటీడీ లో ఏదో జరిగిపోతుందని ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ ఆస్తులు అమ్మితే జగన్మోహన్ రెడ్డి కి గాని వెల్లంపల్లి శ్రీనివాసరావు కి గాని ఒక్కరూపాయి కూడా రాదని అన్నారు. చంద్రబాబులా చీకటి జీవోలు ఇచ్చి అమ్మేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డి కి లేదని వెల్లంపల్లి స్పష్టం చేశారు. టీటీడీ ఆస్తులు అమ్మినా, వాటిని డిపాజిట్లు గానే పొందుపరుస్తామని చెప్పారు. చంద్రబాబులా సదావర్తి భూమలు దొంగ చాటుగా వేలం వేసే చర్యలు వైసీపీ ప్రభుత్వం చేయదని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబులా దోచుకోవాలనే ఆలోచన జగన్ మోహన్ రెడ్డి కి లేదన్నారు. చంద్రబాబుకి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉంటే.. వేలంలో పాల్గొని దేవుడి భూమిని ఎక్కువ డబ్బులకు కొంటే దేవుడికే ఆ డబ్బులు వస్తాయన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: