GHMC Elections: బొంతు రామ్మోహన్ ముందు జాగ్రత్త, మేయర్ పీఠం చేజారిపోకుండా...

డిసెంబర్ 1న జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే తన భార్యను మేయర్ చేయాలంటూ బొంతు రామ్మోహన్ ఇప్పటి నుంచే లాబీయింగ్ చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

news18-telugu
Updated: November 17, 2020, 9:50 PM IST
GHMC Elections: బొంతు రామ్మోహన్ ముందు జాగ్రత్త, మేయర్ పీఠం చేజారిపోకుండా...
మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను కలిసిన దృశ్యం
  • Share this:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంతో అప్పుడే మేయర్ పీఠం కోసం లాబీయింగ్ మొదలైంది. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో టీఆర్ఎస్‌లో మహిళా నేతలు లాబీయింగ్ అప్పుడే ఆరంభమైంది. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్ తన జన్మదినం సందర్భంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్ లో కలిశారు. బొంతు శ్రీదేవి కి మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలతో పాటు రాజకీయాలు కూడా చర్చించినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 1న జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే తన భార్యను మేయర్ చేయాలంటూ బొంతు రామ్మోహన్ ఇప్పటి నుంచే లాబీయింగ్ చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. అందుకోసం వరాలు కూడా ప్రకటించింది. ఇప్పటికే 2020-21 సంవత్సరానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.15 వేల వరకు ఆస్తి పన్ను చెల్లించే గృహ యజమానులకు 50 శాతం రాయితీ ఇచ్చింది. అటు రాష్ట్రంలోని మిగిలిన పట్టణాల్లో రూ.10 వేల వరకు ఆస్తి పన్ను చెల్లించే వారికి 50 శాతం రాయితీ ఇచ్చింది. ఐతే ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది చెల్లించాల్సిన మొత్తంలో మినహాయింపు ఉంటుందని కేటీఆర్ గతంలోనే వెల్లడించారు. ఆస్తి పన్ను రాయితీతో రాష్ట్ర వ్యాప్తంగా 31.40 లక్షల కుటుంబాలకు రూ.326.48 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ఇక ఇటీవల వరదలు వచ్చి హైదరాబాద్‌లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో వారికి రూ.10,000 పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ డబ్బులను టీఆర్ఎస్ కార్యకర్తలకే పంచారని.. అసలైన వరద బాధితులను గాలికొదిలేశారని విమర్శలు వచ్చాయి. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో వరద సాయం అందని వారికి మరో అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ డబ్బులు అందుతాయని తెలిపింది. పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు నెంబర్, కాలనీ, బ్యాంక్ ఖాతా వివరాలతో దరఖాస్తు సమర్పిస్తే.. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10వేలు జమ చేస్తారు. మంత్రి కేటీఆర్ నుంచి ప్రకటన వచ్చిన తర్వాత మీ సేవా సెంటర్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.

2015లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 99 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. ఎంఐఎం 44 సీట్లలో గెలిచింది. టీడీపీ కేవలం ఒక్కచోట గెలుపొందింది. బీజేపీ 4 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 2 సీట్లలో విజయం సాధించింది.

GHMC Election Schedule
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: నవంబర్ 18
నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ: నవంబర్ 20

నామినేషన్ల పరిశీలన: నవంబర్ 21
నామినేషన్ల విత్ డ్రా: నవంబర్ 22, సాయంత్రం 3 గంటల వరకు
తుది జాబితా ప్రకటన: నవంబర్ 22 సాయంత్రంఎన్నికల తేదీ: డిసెంబర్ 1 ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు..
రీ పొలింగ్(అవసరమైన చోట మాత్రమే): డిసెంబర్ 3
కౌంటింగ్: డిసెంబర్ 4 ఉదయం 7 గంటల నుంచి

పోలింగ్ స్టేషన్ల వివరాలు:
మొత్తం పోలింగ్ స్టేషన్లు: 9238(నవంబర్ 21న తుది జాబితా)
సమస్యాత్యక పోలింగ్ స్టేషన్లు: 1439
అత్యంత సమస్యాత్మకం: 1004
మొత్తం వార్డులు: 150
Published by: Ashok Kumar Bonepalli
First published: November 17, 2020, 9:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading