బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలో సర్కారు ఏర్పడితే ప్రైవేటురంగంలో కూడా రిజర్వేషన్లు పెడతామని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి హామీ ఇచ్చారు. కేంద్రంలో మహా ఘఠబంధన్ సర్కారు ఏర్పడిన వెంటనే ప్రైవేటు సెక్టార్ లో రిజర్వేషన్లపై పార్లమెంటులో బిల్లు పెడతామని మాయావతి అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందించామని, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని అన్నారు. ఇదిలా ఉంటే బీఎస్పీ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ, ఆర్ఎల్డీ, జనసేనతో కలిసి దేశ వ్యాప్తంగా పోటీ చేస్తోంది. అయితే ప్రధానంగా మాయావతి ఆధ్వర్యంలో మహాఘఠబంధన్ ఉత్తర ప్రదేశ్ లో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ చెబుతున్న గరీబీ హటావో నినాదం కేవలం ఒక డ్రామా మాత్రమే అని విమర్శించారు. అలాగే మోదీ, యోగీల పవర్ తీయగల సత్తా మహాఘఠబంధన్ కు మాత్రమే ఉందన్నారు. అయితే ఎన్నికలు అవకతవకలు లేకుండా జరిగేలా చూడాలని అన్నానరు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.