MAYAWATI MAKES AN OPEN APPEAL TO MUSLIMS DONT LET YOUR VOTES GET SPLIT BY SIDING WITH CONGRESS MS
కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దు : ముస్లింలకు మాయావతి ఓపెన్ అప్పీల్
బీఎస్పీ అధినేత్రి మాయావతి
బీజేపీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని.. దేశంలో అవినీతి కూడా అదే స్థాయిలో పెరిగిపోయిందని మాయావతి ఆరోపించారు. కాంగ్రెస్‌పై బోఫోర్స్ మచ్చ ఉంటే.. బీజేపీపై రాఫెల్ మచ్చ ఉందన్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలకు ప్రజలు మరో అవకాశం ఇవ్వవద్దని.. ఎస్పీ-బీఎస్పీ కూటమినే గెలిపించాలని కోరారు.
ఉత్తరప్రదేశ్ ముస్లింలకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఓ విజ్ఞప్తి చేశారు. ఈసారి ఎన్నికల్లో ముస్లింలంతా గంపగుత్తగా ఎస్పీ-బీఎస్పీ కూటమికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించే సత్తా కూటమికే ఉందని.. కాంగ్రెస్‌కు ఓటు వేసి అనవసరంగా ఓట్ల చీలిక తేవద్దని అన్నారు. 25 ఏళ్ల తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.
నేనొక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. ఇక్కడ బీజేపీని ఢీకొట్టే సత్తా కూటమికి తప్ప కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకరకంగా ఓట్ల చీలిక ద్వారా బీజేపీకి పరోక్షంగా సహాయం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాబట్టి ఈ ఎన్నికల్లో మైనారిటీలంతా ఎస్పీ-బీఎస్పీ కూటమికే ఓటేయాలని కోరుతున్నా.
— మాయావతి, బీఎస్పీ అధినేత్రి
సహరన్‌పూర్‌లో కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టడానికి కారణం ఓట్లను చీల్చాలన్న ఉద్దేశమే అన్నారు. అక్కడ మొదట తాము ముస్లిం అభ్యర్థిని నిలబెట్టిన తర్వాతే.. కాంగ్రెస్ కూడా ముస్లిం అభ్యర్థిని ప్రకటించిందన్నారు. ఇక రాహుల్ గాంధీ 'న్యాయ్' పథకం గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలకు కనీస ఆదాయం అందించే బదులు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యం అన్నారు. అంతేకాదు, గతంలో పేదరిక నిర్మూలనకు ఇందిరా గాంధీ కూడా 20 పాయింట్లతో ఒక ప్రణాళిక రూపొందించారని.. అదేమి పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని అన్నారు.ఇక బీజేపీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని.. దేశంలో అవినీతి కూడా అదే స్థాయిలో పెరిగిపోయిందని మాయావతి ఆరోపించారు. కాంగ్రెస్‌పై బోఫోర్స్ మచ్చ ఉంటే.. బీజేపీపై రాఫెల్ మచ్చ ఉందన్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలకు ప్రజలు మరో అవకాశం ఇవ్వవద్దని.. ఎస్పీ-బీఎస్పీ కూటమినే గెలిపించాలని కోరారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.