మాయావతి పెళ్లి చేసుకోలేదు.. కాబట్టే కుటుంబ విలువ గురించి తెలియదు : కేంద్రమంత్రి విమర్శలు

ఇటీవల మోదీపై ఘాటైన విమర్శలు చేసిన మాయావతి.. రాజకీయం కోసం మోదీ కట్టుకున్న భార్యనే వదిలేశారని విమర్శించారు. అంతేకాదు, బీజేపీలో వివాహితులైన మహిళా నేతలు తమ భర్తలను మోదీతో పాటు చూస్తే తెగ భయపడిపోతున్నారని... ఎక్కడ మోదీ తమను కూడా భర్తల నుంచి దూరం చేస్తారేమోనని వాళ్లు దిగులు చెందుతున్నారని ఘాటైన విమర్శలు చేశారు.

news18-telugu
Updated: May 17, 2019, 2:46 PM IST
మాయావతి పెళ్లి చేసుకోలేదు.. కాబట్టే కుటుంబ విలువ గురించి తెలియదు : కేంద్రమంత్రి విమర్శలు
రాందాస్ అథవాలే(ఫైల్ ఫోటో)
  • Share this:
లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు గడువు దగ్గరపడుతున్నకొద్ది.. అధికార-ప్రతిపక్షాల మధ్య వ్యక్తిగత విమర్శల దాడి ఎక్కువవుతోంది. ఇటీవల ప్రధాని మోదీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యక్తిగత విమర్శలు చేయడంతో.. బీజేపీ శ్రేణులు కూడా ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే మాయావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయావతి పెళ్లి చేసుకోని కారణంగా.. ఆమెకు కుటుంబ విలువ గురించి తెలియదన్నారు. ఒకవేళ మాయావతి పెళ్లి చేసుకుని ఉంటే భర్తతో ఎలా మెలగాలో తెలిసి ఉండేదన్నారు.

ఇటీవల మోదీపై ఘాటైన విమర్శలు చేసిన మాయావతి.. రాజకీయం కోసం మోదీ కట్టుకున్న భార్యనే వదిలేశారని విమర్శించారు. అంతేకాదు, బీజేపీలో వివాహితులైన మహిళా నేతలు తమ భర్తలను మోదీతో పాటు చూస్తే తెగ భయపడిపోతున్నారని... ఎక్కడ మోదీ తమను కూడా భర్తల నుంచి దూరం చేస్తారేమోనని వాళ్లు దిగులు చెందుతున్నారని ఘాటైన విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత భార్యనే వదిలేసిన వ్యక్తికి.. ఇతరుల భార్యలు, సోదరిల పట్ల ఎలా గౌరవం ఉంటుందని మండిపడ్డారు.

మాయావతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణులు కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టాయి. రాజస్తాన్ అల్వార్‌లో దళిత మహిళపై అత్యాచారం జరిగితే మాయావతి ఎందుకని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని ప్రశ్నించాయి. అల్వార్ ఘటనపై మాయావతి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని.. ఆ ఘటనను ఆమె నిజంగా సీరియస్‌గా తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఉపసంహరించుకోవట్లేదని మోదీ సైతం నిలదీశారు.
First published: May 17, 2019, 2:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading