వచ్చే ఎన్నికలు బ్యాలెట్‌తోనే జరగాలి...మాయావతి డిమాండ్
బీఎస్పీ అధినేత్రి మాయావతి(ఫైల్ ఫోటో)
2014 ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాపింగ్ చేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని సైబర్ నిపుణుడు సయ్యిద్ షుజా లండన్‌లో ఆరోపించిన నేపథ్యంలో మాయావతి మళ్లీ తన పాత డిమాండ్‌ను లేవనెత్తారు. ఈవీఎంలను బ్యాన్ చేసి వచ్చే ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దేశంలో ఈవీఎంల వినియోగాన్ని బ్యాన్ చేయాలని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి మళ్లీ డిమాండ్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా పాత బ్యాలెట్ పేపర్ల పద్ధతిలోనే నిర్వహించాలని కోరారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల ట్యాపింగ్‌కి పాల్పడిందని గతంలో ఆరోపించిన ఆమె...గతంలో పలు సందర్భాల్లో ఈవీఎంలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాకింగ్ చేసి రిగ్గింగ్‌కు పాల్పడిందని సైబర్ నిపుణుడు సయ్యిద్ షుజా లండన్‌లో సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో మాయావతి తన డిమాండ్‌ను మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారు.
ప్రతీకాత్మక చిత్రం
లండన్‌లో సైబర్ నిపుణుడు ఈవీఎంల ట్యాపింగ్‌పై వెల్లడించిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నట్లు ఓ ప్రకటనలో మాయావతి పేర్కొన్నారు. దేశ శ్రేయస్సు దృష్ట్యా ఈవీఎంలను తక్షణమే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఓట్లు మాకు...రాజ్యాధికారం మీకు’ అనే ధోరణి ఇక ఎంత మాత్రం సాగదని, ఈవీఎం వివాదానికి శాశ్విత ముగింపు పలకాలని కోరారు. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు తిరిగి బ్యాలెట్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు ఆ ప్రకటనలో ఆశాభావం వ్యక్తంచేశారు.
ప్రతీకాత్మక చిత్రం
2014 ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాపింగ్ చేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని సైబర్ నిపుణుడు సయ్యిద్ షుజా లండన్‌లో ఆరోపించారు. అయితే ఆయన ట్యాపింగ్ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.