MAYAWATI AND OWAISI SHOULD GET BHARAT RATNA FOR HELPING BJP SHIV SENA MP SANJAY RAUT ON UP ELECTION RESULTS PVN
Sanjay Raut : మాయావతి,ఓవైసీకి భారత రత్న ఇవ్వాలన్న శివసేన
ఫైల్ ఫొటో
Shiv Sena On Mayawati, Owaisi :ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Election results)విపక్షాలకు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. అధికార పార్టీ బీజేపీ హవా ముందు రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన సమాజ్వాది(Samajwadi)పార్టీ, బహుజన్ సమాజ్ (Bahujan Samaj Party)పార్టీ అడ్రస్ గల్లంతైపోయాయి. గెలుపుపై కోటి ఆశలు పెట్టుకున్న రెండు పార్టీలు పరాజయం పాలయ్యాయి.
Sanjay Raut on UP election results : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Election results)విపక్షాలకు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. అధికార పార్టీ బీజేపీ హవా ముందు రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన సమాజ్వాది(Samajwadi)పార్టీ, బహుజన్ సమాజ్ (Bahujan Samaj Party)పార్టీ అడ్రస్ గల్లంతైపోయాయి. గెలుపుపై కోటి ఆశలు పెట్టుకున్న రెండు పార్టీలు పరాజయం పాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ తో కలిపి తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మొత్తం ఐదు రాష్ట్రాలకు గాను.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం స్పందిస్తూ బీజేపీ గెలుపుపై సన్నాయి నొక్కులు నొక్కారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీలు పరోక్షంగా సహకరించారని, వారిద్దరికీ పద్మ విభూషణ్, భారత రత్న పురస్కారాలను అందజేయాలని సంజయ్ రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా,ఇక, యూపీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన బీఎస్పీ.. దాదాపు 13 శాతం ఓట్లను సాధించింది. కానీ, కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. అటు, ఎంఐఎం కూడా 100 సీట్లలో పోటీచేసి ఒక్క సీటు గెలకపోయినా 4 లక్షలకుపైగా ఓట్లు పొందింది.
యూపీలో బీజేపీ ఘన విజయం సాధించిందని, అది ఇప్పటికే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రమని కానీ, అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ తన మెజార్టీని మూడు రెట్టు పెంచుకుందని సంజయ్ రౌత్ అన్నారు. .ఈ ఎన్నికల్లో ఎస్పీకి 125 స్థానాలు వచ్చాయని, అంటే అంతకుముందు కన్నా మూడు రెట్లు పెరిగాయని చెప్పారు. గత ఎన్నికల్లో 42 స్థానాల నుంచి ఇప్పుడు 125 స్థానాలకు చేరిందన్నారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ పై ప్రజల్లో మద్దతు పెరిగిందో, వ్యతిరేకత ఉందొ అర్ధం చేసుకోవాలంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో బీజేపీ విజయం గురించి తాము తల్లకిందులు కావాల్సిందేమీ లేదన్నారు. వారి సంతోషాన్ని తాము కూడా పంచుకుంటామని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గోవాలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు.
పంజాబ్ లో బీజేపీని పూర్తిగా తిరస్కరించారని, జాతీయవాద పార్టీని పంజాబ్లో తిరస్కరించడం చాలా బాధాకరమని వ్యంగ్యంగా అన్నారు. ఎన్నికల వేళ ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి, అందరూ పంజాబ్లో విపరీతంగా ప్రచారం చేసినా పంజాబ్ లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించిన సంజయ్ రౌత్..యూపీలో కాంగ్రెస్, శివసేనతో పోలిస్తే పంజాబ్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు బలంగా లేకపోవడమే బీజేపీకి కలిసొచ్చిందంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.