అయోధ్య వివాదాస్పద భూమి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమాతే ఉలేమా ఎ హింద్ అనే సంస్థ రివ్యూ పిిటిషన్ దాఖలు చేసింది.మౌలానా సయ్యద్ అషద్ రషీది అనే వ్యక్తి అయోధ్య ల్యాండ్ ఇష్యూపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆలిండియా ముస్లీం పర్సనల్ లా బోర్డు మాత్రం దీనిపై ఇప్పట్లో రివ్యూ పిటిషన్ వేసేది లేదంది. దీనిపై జాఫర్యాబ్ జిలాని మాట్లాడుతూ ఇవాళ సుప్రీంలో మేం ఎలాంటి రివ్యూ పిటిషన్ వేయడం లేదన్నారు. డిసెంబర్ 9లోపు అయోధ్య తీర్పుపై మేం ఎప్పుడైనా రివ్యూ పిటిషన్ వేశామన్నారు.
గతంలో దీనిపై మాట్లాడిన అఖిల భారత ముస్లీం పర్సనల్ లా బోర్డు అయోధ్య కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు స్పష్టంగా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తీర్పు 1000 పేజీలకు పైగా ఉండటంతో... అది క్లియర్గా లేదంటోంది ముస్లిం పర్సనల్ లా బోర్డు. దీనిపై సమీక్ష (రివ్యూ)కి వెళ్తామని తెలిపింది. ఐతే... ఎప్పుడు వెళ్లేదీ డేట్ మాత్రం చెప్పలేదు. ఐతే... డిసెంబర్ 9న రివ్యూ పిటిషన్ వేస్తారని సమాచారం. లక్నోలో దీనిపై సమావేశం జరిగింది. ముస్లిం పెద్దలు చర్చించుకున్నారు. ఆ తర్వాత రివ్యూకి వెళ్లబోతున్నట్లు జమైత్ ఉలేమా ఎ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ తెలిపారు. రివ్యూకి వెళ్తే... తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనే ఆలోచన లేకపోయినా... మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడాన్ని వ్యతిరేకించాలనుకుంటున్నట్లు అప్పట్లో వివరించారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.