MAOISTS THREAT TO TRS LEADERS TELANGANA POLICE HIGH ON ALERT
హై అలర్ట్.. టీఆర్ఎస్ నాయకులపై దాడులకు మావోల స్కెచ్?
ప్రతీకాత్మక చిత్రం..
ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో తమ ఉనికిని చాటుకునేందుకు గత కొంతకాలంగా మావోలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు టీఆర్ఎస్ నాయకులను టార్గెట్‌గా చేసుకుని మావోయిస్టులు దాడులకు స్కెచ్ వేసినట్టు సమాచారం.
తెలంగాణ ఎన్నికలవేళ.. చాప కింద నీరులా మావోలు తమ ఆపరేషన్స్‌కు సిద్దమవుతున్నారు. నేతలంతా ఎన్నికల కోలాహలంలో మునిగినవేళ గట్టి అలజడి రేపేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రెక్కీ కూడా నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు చెందిన ఓ ఆపద్దర్మ మంత్రి, స్పీకర్, పలువురు ను వారు టార్గెట్ చేసినట్టు సమాచారం.
మావోలు రెక్కీ నిర్వహించినట్టు సమాచారం అందడంతో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది. వెంటనే ఏజెన్సీ ఏరియాల్లోని నాయకులను అలర్ట్ చేసింది. దీంతో తాడ్వాయి మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అజ్మీరా చందూలాల్ మధ్యలోనే వెనుదిరిగారు. దాదాపు 30మంది మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్ తమ ఆపరేషన్స్ కోసం రంగంలోకి దిగినట్టు పోలీసులు సమాచారం సేకరించారు. వీరికి ఆశ్రయం కల్పిస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో తమ ఉనికిని చాటుకునేందుకు గత కొంతకాలంగా మావోలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల డీజీపీ మహేందర్ రెడ్డి మావో ప్రభావిత జిల్లాల్లో స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.