Home /News /politics /

MAOISTS ASK PEOPLE OF TELANGANA BOYCOTT TELANGANA ELECTIONS

ఎన్నికలను బహిష్కరించండి: తెలంగాణ ప్రజలకు మావోల పిలుపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నైజాం రాజును తలదన్నేలా కేసీఆర్ పాలన కొనసాగుతోందని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలేవి నెరవేర్చలేదని ఆరోపించారు.

    డిసెంబర్ 7న తెలంగాణలో జరగబోయే ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు జయశంకర్ జిల్లా వెంకటాపురం వాజేడు మండలంలోని మారుమూల గ్రామాల్లో బ్యానర్లు ఏర్పాటు చేసింది. ఎన్నికలను బహిష్కరించి ఓట్ల కోసం వస్తున్న టీఆర్ఎస్ నాయకులను తరిమికొట్టాలని ప్రజలను కోరింది.

    మావోయిస్టు పార్టీ కార్యదర్శి సుధాకర్ పేరుతో ఓ లేఖ కూడా బయటకు వచ్చింది. టీఆర్ఎస్ కుటుంబ పాలనలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, పౌర హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. నైజాం రాజును తలదన్నేలా కేసీఆర్ పాలన కొనసాగుతోందని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలేవి నెరవేర్చలేదని ఆరోపించారు. బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించి ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలని లేఖ ద్వారా పిలుపునిచ్చారు.

    మరోవైపు మావోయిస్ట్ హెచ్చరికలతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం హైఅలర్ట్ అయింది. ఆసిఫాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో మావోయిస్టు కదలికలపై నిఘా పెట్టింది. మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి స్వయంగా పర్యటించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు ఫోకస్ చేశారు.



    (మావోయిస్టు లేఖ..)
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: CM KCR, Maoist attack, Telangana, Telangana Election 2018

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు