మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు..!

తెలంగాణలోనూ మావోదళాలు.. పక్కా స్కెచ్‌లు వేస్తున్నాయి.అరకు తరహా దాడులకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే విషయంపై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జరీ చేసింది.

news18-telugu
Updated: October 8, 2018, 11:48 AM IST
మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు..!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి హత్యతో మావోయిస్టులు తన ప్రాబల్యం తగ్గిపోలేదని మరోసారి నిరూపించారు. దీంతో అరకు తరహా దాడులకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే విషయంపై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జరీ చేసింది. తెలంగాణలో నక్సలిజాన్ని పూర్తిగా ఏరివేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం, నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలను తగ్గించామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకునేందుకు మావోయిస్టు దళాలు సిద్ధమవుతున్నాయి.

తెలంగాణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో మాటు వేసిన మావోలు అరకు తరహా దాడులకు ప్రణాళికలు వేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల సమయం కావడంతో... ఎన్నికల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చే నాయకులపై ద‌ృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించే టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులను టార్గెట్‌గా చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈవిషయాన్ని స్వయంగా కేంద్ర నిఘా సంస్థ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం... చెబుతుంది. మావోయిస్టులపై ప్రత్యేక నిఘా పెట్టిన సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు మావోల దాడులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తెలంగాణలో తమ ప్రాబల్యం తగ్గలేదంటూ తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు రెడీఅవుతున్నారు. అందుకే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. స్టేట్‌ మల్టీ ఏజెన్సీస్‌ కమిటీ ..స్మాక్‌, ఇతర వర్గాలు సమాచార మార్పిడికి చర్యలు తీసుకోవాలని సూచించాయి.

ఆంధ్రా-ఒడిసా సరిహద్దులో ఇటీవల అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మట్టుపెట్టినట్ల... తెలంగాణలోనూ మావోదళాలు.. పక్కా స్కెచ్‌లు వేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో వచ్చే నెల 12న తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ 18 మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో ట్రయల్స్‌తో ప్రారంభించి తెలంగాణ ఎన్నికల సమయానికల్లా ఇక్కడ తమ వ్యూహాలను అమలు చేయాలని మావోయిస్టులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపాయి. వారి వ్యూహాలను తిప్పికొట్టాలని రాష్ట్ర పోలీసు వర్గాలకు సూచించాయి. మహారాష్ట్ర, ఛత్తీ‌సగఢ్‌లతో సరిహద్దును పంచుకుంటున్న గోదావరి తీరప్రాంతాలు, కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నిఘా ఏర్పాటు చేయాలన్నాయి. ఈమేరకు జిల్లా ఎస్సీలకు, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశాయి. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏజెన్సీలో ప్రచారానికి నాయకులు వెళ్లరాదని జిల్లా ఎస్పీలు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు, అధికారులు, నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

First published: October 8, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>