గిడ్డి ఈశ్వరీని చంపేస్తాం:మావోయిస్టు వార్నింగ్ లెటర్..!

మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో వచ్చిన లేఖలో గిరిజన ద్రోహానికి పాల్పడుతున్నందుకే వారిని ప్రజాకోర్టులో శిక్ష విధించామని పేర్కొన్నారు. కిడారి బాక్సైట్ కు అనుకూలంగా మారుతున్నారు..గూడ క్వారీ విషయంలో ఆయనను ఎన్నో సార్లు హెచ్చరించాం.

news18-telugu
Updated: October 10, 2018, 10:53 AM IST
గిడ్డి ఈశ్వరీని చంపేస్తాం:మావోయిస్టు వార్నింగ్ లెటర్..!
గిడ్డి ఈశ్వరి (File)
  • Share this:
ఆరకు ఎమ్మెల్యే కిడారి, సోమా హత్యతోదంతం పై మావోల పేరిట లేఖ విడుదలైంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో వచ్చిన లేఖలో గిరిజన ద్రోహానికి పాల్పడుతున్నందుకే వారిని ప్రజాకోర్టులో శిక్ష విధించామని పేర్కొన్నారు. కిడారి బాక్సైట్ కు అనుకూలంగా మారుతున్నారని ఆరోపించారు. గూడ క్వారీ విషయంలో ఆయనను ఎన్నో సార్లు హెచ్చరించాం..అయినా పద్దతి మార్చుకోలేదన్నారు మావోలు. పోలీసులకు మాకు ఎలాంటి శతృత్వం లేదన్నారు. అందుకే ఆయుధాలతో దొరికినా  పోలీసులకు ఎటువంటి హాని చేయలేదన్నారు.

మావోయిస్టు లేఖ


మరోవైపు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీకి లేఖ ద్వారా బెదిరించారు. అధికార పార్టీకి 20 కోట్లకు అమ్ముడుపోయిందని ఆరోపించారు మావోయిస్టులు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలన్నారు. గిడ్డి ఈశ్వరి పద్ధతి మార్చుకోకపోతే.. కిడారి, సోమకు పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. కిడారి.. ఈశ్వరీకి సంబంధించిన అన్ని విషయాలు చెప్సారన్నారు. ఆమె తీసుకున్న డబ్బుల్ని రెండునెలల్లో గిరిజనులకు పంచిపెట్టాలని హెచ్చరించారు. అయితే మావోయిస్టుల పేరుతో విడుదలైన ఈ లేఖపై పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మావోలు ఉపయోగించే భాష.. కాగితాలు భిన్నంగా ఉంటాయి. కానీ ఈసారి మావోలు విడుదల చేసే లేఖలో అనేక మార్పులున్నాయి. దీంతో ఇవి నిజంగా మావోయిస్టులే విడుదల చేశారా లేక.. వేరేవాళ్లు విడదుల చేసి మావోల పేరు వాడుతున్నారన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మావోయిస్టు లేఖ
Published by: Sulthana Begum Shaik
First published: October 10, 2018, 10:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading