MANOHAR PARRIKAR SON UTPAL PARRIKAR QUITS BJP TICKET DENIED TO CONTEST INDEPENDENT FROM PANAJI MKS
Utpal Parrikar: బీజేపీకి మనోహర్ పారికర్ కొడుకు గుడ్‌బై.. కమలానికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో
బీజేపీని వీడిన పారికర్ కొడుకు
బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి, గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీని వీడారు. తాను ఆశించిన నియోజకవర్గం టికెట్ కేటాయించకపోవడంతో
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న ఐదు రాష్ట్రాల్లో అతి చిన్నదైన గోవాలో రాజకీయం రోజుకో మలుపుతిరుగుతోంది. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి, గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీని వీడారు. తాను ఆశించిన నియోజకవర్గం టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అలకబూనారు. పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
బీజేపీని వీడిన ఉత్పల్ పారికర్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడనున్నట్లు ఆయన వెల్లడించారు. పనాజీ నియోజవర్గం నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. తన తండ్రి పోటీ చేసిన స్థానాన్ని (పనాజీ) సెంటిమెంట్ గా భావిస్తుండడం వల్ల..అక్కడి నుంచే పోటీకి దిగాలని ఉత్పల్ పారికర్ నిర్ణయించారు.
గోవా ఎన్నికలకు బీజేపీ 34 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. అందులో ఉత్పల్ పారికర్ పేరు లేకపోగా.. పనాజీ నియోజకవర్గ టికెట్ అటానాసియో మోన్సెరేట్ కు కేటాయించింది. దీనిని ఉత్పల్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. బీజేపీకి ఆయన గుడ్ బై చెబుతారన్న ప్రచారంతో విపక్ష పార్టీలు వెల్ కమ్ చెప్పాయి. తమ పార్టీలోకి రావాలని ఆప్ ఆహ్వానం పలికింది. ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ జరిగింది. కానీ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఏ పార్టీలో చేరకుండా..స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించడం విశేషం.
ప్రస్తుతం గోవాలో 40 స్థానాలున్నాయి. ఇక్కడ ఫిబ్రవరి 14వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. 2017లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించింది. కానీ..సాధారణ మెజార్టీ 21 కాగా..కాంగ్రెస్ కేవలం 17 సీట్లు సాధించి..అధికార పీఠానికి కొద్దిదూరంలో ఆగిపోయింది. బీజేపీకి 13 సీట్లు వచ్చాయి. ఇతర పార్టీల మద్దతు తీసుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం పెరిగిపోయింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.