మాజీ ప్రధానికి షాక్... మన్మోహన్ సింగ్‌‌కు భద్రత తగ్గించిన కేంద్రం

మన్మోహన్ సింగ్ కు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది.

news18-telugu
Updated: August 26, 2019, 11:30 AM IST
మాజీ ప్రధానికి షాక్...  మన్మోహన్ సింగ్‌‌కు భద్రత తగ్గించిన కేంద్రం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
  • Share this:
భారత మాజీ ప్రధాని మన్మోమన్ సింగ్‌ భద్రతను కేంద్రం కుదించింది. ఇప్పటికే ఉన్న సెక్యూరిటీని తగ్గిస్తూ చాలామంది రాజకీయ నేతలకు షాకిచ్చిన కేంద్రం.. మాజీ ప్రధానికి ఉన్న సెక్యూరిటీని కూడా తగ్గించింది. మన్మోహన్ సింగ్ కు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది. ఆయనను సీఆర్ఫీఎఫ్ బలగాల భద్రత కిందకు తీసుకొచ్చింది. దేశంలోని ప్రముఖుల భద్రతను సమీక్షించే విభాగం నివేదికల ఆధారంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రముఖుల జీవితాలకు ముప్పు ఎంత వరకు ఉందనే వార్షిక సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నమన్నారు కేంద్ర హోంశాఖ అధికారులు. మన్మోహన్ కు ఎస్పీజీ భద్రతను తొలగించినప్పటికీ... ఆయనకు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కొనసాగుతుందన్నారు.  పదేళ్ల పాటు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్... తన భద్రత విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావడం లేదు.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు