CM Jagan Medical tests: గత సాధారణ ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రెండున్నరేళ్లుగా క్షణం తీరికలేకుండా పనిచేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం పేరుతో బిజీగా ఉన్నారు. వరుస సమావేశాలు. అధికారులతో రివ్యూలు, పర్యటనలు, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు అంటూ బిజీ బిజీగా ఉంటున్నారు. తాజాగా ఒడిషా (Odisha) వెళ్లి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) తో సమావేశమయ్యారు. ఇద్దరి సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య దశాబ్ధాలుగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎం లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేశారు.. ఆ పర్యటన కు వెళ్లే ముందు.. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే కూతురి వివాహానికి హాజర్యారు.. ఒడిశా పర్యట నుంచి వచ్చిన తరువాత కూడా ఆయన బిజీగానే ఉన్నారు. అయితే తాజాగా వైఎస్ జగన్ కు తాజాగా కాలు బెణికింది. ఉదయం వ్యాయామ సమయంలో కాలు బెణకడంతో డాక్టర్లు తాత్కాలిక చికిత్స అందించారు. కానీ పూర్తిగా నయం కాలేదు. దీంతో నొప్పితో బాధపడుతూనే రోజువారీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
గతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలోనే కాలునొప్పి ప్రారంభమైందని, దానికి తోడు మరోసారి తాజాగా కాలు బెణకడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయనికి సమీపంలోనే ఉన్న మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం మణిపాల్ ఆస్పత్రికి వెళ్లిన జగన్ కు వైద్యులు ప్రాధమిక పరీక్షలు చేశారు. కాలు బెణుకు తీవ్రత నేపథ్యంలో ఎక్స్ రే కానీ స్కానింగ్ చేశారు. కాలు బెనకడంతో పాటు నడుం కూడా నొప్పి అనిపించడంతో అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి: మేఘాన్ని ముద్దాడే కొండలు.. ఇదెక్కడో కొడైకెనాలో. కులుమనాలినో కాదు.. మన దగ్గరే..
కాలు నొప్పి తీవ్రంగా ఉన్న సమయంలోనూ రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నజగన్ కు తాజాగా నొప్పి మరింత పెరగడంతో మణిపాల్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇావాళ సీఎం జగన్ విద్యారంగంపై సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఆ లోపే మణిపాల్ ఆస్పత్రికి వెళ్లడంతో జగన్ కాలు బెణుకుపై పార్టీతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమైంది. అయితే మణిపాల్ ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు జగన్ కాలు బెణుకు అంత తీవ్రమైనది కాదని తెలుస్తోంది. సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి కొన్ని సూచనలు చేశారు.
అమరావతిలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు పలు పరీక్షలు చేశారు. ఇటీవలే ఎక్సర్ సైజ్ చేస్తుండగా..ఆయన కాలికి గాయమైంది. అప్పటి నుంచి మడమనొప్పితో బాధ పడుతున్నారు. నొప్పి ఎక్కువ కావడం, వాపు రావడంతో…డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల రిపోర్టులను చూసిన అనంతరం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్ కు వైద్యులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Cm jagan