హస్తం పార్టీలో ప్రక్షాళన, తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్

మాణిక్యం ఠాగూర్ తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం అయిన NSUIలో స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

news18-telugu
Updated: September 11, 2020, 10:45 PM IST
హస్తం పార్టీలో ప్రక్షాళన, తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్
మాణిక్యం ఠాగూర్
  • Share this:
Manickam Tagore: కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టింది. అయితే, ఆ మొదట్లోనే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీ కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఉన్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఆర్సీ కుంతియాను తప్పించి ఆయన స్థానంలో మాణిక్యం ఠాగూర్‌కు పగ్గాలు అప్పగించింది. అలాగే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జాబితా నుంచి గులాం నబీ ఆజాద్‌ను తొలగించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభానికి గులాం నబీ ఆజాద్ కూడా కారణం అని హస్తం పెద్దలు భావించారు. కాంగ్రెస్ పార్టీని తాత్కాలిక అధ్యక్షుల చేతిలో ఉంచడం కంటే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ పార్టీలో కొందరురాసిన లేఖ పెను దుమారం సృష్టించింది. అయితే, అదంతా ఆజాద్ కనుసన్నల్లో జరిగిందనే విషయం కూడా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. లేఖలను ఆజాద్ సమర్థించారు. పార్టీ బాగు కోసమే లేఖ రాశామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏఐసీసీలో భారీ ప్రక్షాళన చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. గులాం నబీ ఆజాద్‌ను జనరల్ సెక్రటరీ నుంచి తప్పించింది. ఉత్తర్ ప్రదేశ్ బాధ్యతలను ప్రియాంకాగాంధీకి అప్పగించింది. అలాగే, తెలంగాణ ఇన్ చార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను నియమించింది.

మాణిక్యం ఠాగూర్ తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం అయిన NSUIలో స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం ఆల్ ఇండియా ఎన్ఎస్‌యూఐ జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2009లో తమిళనాడులోని విరుధానగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లో మరోసారి విరుధానగర్ నుంచి రెండోసారి గెలుపొందారు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇన్ చార్జిని మార్చలేదు. కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీనే కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 11, 2020, 9:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading