Home /News /politics /

మంగళగిరిలో అమరావతి... వైసీపీ ఎమ్మెల్యే సరికొత్త వాదన

మంగళగిరిలో అమరావతి... వైసీపీ ఎమ్మెల్యే సరికొత్త వాదన

అమరావతి ప్రతీకాత్మక చిత్రం

అమరావతి ప్రతీకాత్మక చిత్రం

రాజధాని అంశంపై వైసీపీ ఎమ్మెల్యే, సీఎం జగన్‌కు సన్నిహితుల్లో ఒకరైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు.

    రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో... ఎవరికి వారే కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. అమరావతిని మరో చోటకు తరలిస్తారనే ప్రచారంతో... తిరుపతి, కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చెందిన కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజధానిని అమరావతి నుంచి మరో చోటకు తరలించబోమని ఇప్పటికే కొందరు మంత్రులు క్లారిటీ ఇచ్చినా... దీనిపై డిమాండ్లు మాత్రం ఆగడం లేదు. అయితే రాజధాని అంశంపై వైసీపీ ఎమ్మెల్యే, సీఎం జగన్‌కు సన్నిహితుల్లో ఒకరైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు.

    రాజధానిని మంగళగిరిలో నిర్మించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అమరావతి పరిధిలోకి మంగళగిరిలోని కొన్ని ప్రాంతాలు కూడా వస్తాయని వివరించిన ఎమ్మెల్యే ఆర్కే... మంగళగిరి ముంపు ప్రాంతం కాదని వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉన్న 10 నుంచి 15 వేల ప్రభుత్వ స్థలంలో రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని ఆయన అభిప్రాయపడ్డారు. సీఆర్డీయే పరిధిలోని అనేక గ్రామాలు ఉన్నాయని... అంతా రాజధాని ప్రాంతమే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మొత్తానికి రాజధానిని విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన సూచనలను ప్రభుత్వం ఏ రకంగా పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి.




    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Alla Ramakrishna reddy, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Bjp, Mangalagiri, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు