Home /News /politics /

MANGALAGIRI WILL BECOME GACHIBOWLI OF ANDHRA PRADESH SAYS NARA LOKESH BA

మంగళగిరిని మరో గచ్చిబౌలిలా మార్చేస్తాం: నారా లోకేష్

నారా లోకేశ్ (ఫైల్ ఫోటో)

నారా లోకేశ్ (ఫైల్ ఫోటో)

ఐటీ మంత్రిగా తాను మంగళగిరి నియోజకవర్గానికి ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చానని లోకేష్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో మరిన్ని ఐటీ కంపెనీలను తీసుకొస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.

    ఏపీ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తాను పోటీ చేయబోయే మంగళగిరి నియోజకవర్గంలో తొలిసారి క్యాంపెయిన్‌ను చేపట్టారు. తొలుత సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తల సభలో లోకేష్ మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గానికి తాను మూడేళ్ల క్రితమే ఓటు హక్కును మార్చుకున్నట్టు చెప్పారు. మంగళగిరిని మరో గచ్చిబౌలిగా మారుస్తామని ఈ సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చారు. ఐటీ మంత్రిగా తాను మంగళగిరి నియోజకవర్గానికి ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చానని లోకేష్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో మరిన్ని ఐటీ కంపెనీలను తీసుకొస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. యువతీ యువకులకు సొంత జిల్లాలోనే ఉపాధి కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని లోకేష్ అన్నారు. ప్రతిపక్ష వైసీపీ మీద లోకేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ ఓ అద్భుతమైన డ్రామా కంపెనీలా మారిపోయిందని విమర్శించారు. ఎన్నికలు రావని తెలిసిన తర్వాత ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి.. తాము ఏడాది ముందే రాజీనామా చేశామంటూ డ్రామా చేశారని లోకేష్ విమర్శించారు. రాష్ట్రంలో అలజడి సృష్టించడానికే కోడికత్తి దాడి డ్రామా ఆడారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి భద్రత కోసం ఏపీ పోలీసులు కావాలి కానీ, కేసుల విచారణకు మాత్రం అవసరం లేదని లోకేష్ ఎద్దేవా చేశారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న నారా లోకేష్ మంగళగిరి నుంచి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి మీద వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్ల తేడాతో గెలుపొందారు.
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Nara Lokesh, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు