కనిపించని మంగళగిరి ఎమ్మెల్యే... పోలీసులకు ఫిర్యాదు

గత వారం రోజుల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గానీ.. ఆయన కార్యాలయంలోగానీ.. నివాసంలో గానీ ఎక్కడా ఆయన కనిపించట్లేదు.

news18-telugu
Updated: December 23, 2019, 12:08 PM IST
కనిపించని మంగళగిరి ఎమ్మెల్యే... పోలీసులకు ఫిర్యాదు
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న రైతులు
  • Share this:
మంగళగిరి ఎమ్యేల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కనుబడటంలేదంటూ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రైతులు. ఓవైపు అమరావతి రాజధాని తరలిపోతుందని రైతులు ఆందోళనలు చేస్తుంటే.. మరోవైపు ఎమ్మెల్యే ఆళ్ల అడ్రస్ లేకుండా పోయారంటున్నారు రైతులు. దీంతో ఆయన కనిపిస్తే వెతికి పెట్టడంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు.

‘రాజధానిపై నెలకొన్న సందిగ్దతపై మా గోడు వెళ్లబుచ్చుకుందామంటే మా ఎమ్మెల్యే  ఎక్కుడున్నారో తెలియట్లేదు. మా ఎమ్మెల్యే కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. మీరు వెంటనే తగు చర్యలు తీసుకుని మా శాసభన సభ్యులను మాకు అప్పగిస్తారని భావిస్తున్నాం. గత వారం రోజుల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గానీ.. ఆయన కార్యాలయంలోగానీ.. నివాసంలో గానీ ఎక్కడా ఆయన కనిపించట్లేదు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కావున వెంటనే ఆయన్ను వెతికి మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాము’ అని ఫిర్యాదులో రాజధాని రైతులు, రైతు కూలీలు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదు పత్రంలో రాజధాని రైతులు, కూలీలు సంతకాలు కూడా చేశారు. అనంతరం మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు అందించారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 23, 2019, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading