అసెంబ్లీలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు... జగన్ షార్ప్ రియాక్షన్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: January 20, 2020, 3:44 PM IST
అసెంబ్లీలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు... జగన్ షార్ప్ రియాక్షన్..
అసెంబ్లీలో మాట్లాడుతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులతో తనకు రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోయినా తాను జగన్ వెంట నడుస్తానని స్పష్టం చేశారు. ‘మంగళగిరి ఎమ్మెల్యే అయిన నేను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన అధికార - అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను పూర్తిగా సమర్ధిస్తున్నా. ఈ మూడు రాజధానులతో నాకు రాజకీయ భవిష్యత్ ఉన్నా, లేకపోయినా నేను జగన్ వెంట నడుస్తా. రాజకీయాల్లో ఉంటే జగన్ వెంటే ఉంటా. రాజకీయాల్లో లేకపోతే నా పొలంలో ఉంటా.’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆర్కే ఆ మాటలు అంటున్న సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయన వంకే చూస్తూ ఉన్నారు.

చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు తాము ఎంతో సంతోషించామని ఆళ్ల అన్నారు. అయితే, దాని వెనుక ఎంతో స్కామ్ జరిగిందని తెలిసి తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు. చంద్రబాబుకు దళితులంటే చులకన అని వారి భూములు ముందే కొనేశారని ఆరోపించారు. రాజధాని కోసం చంద్రబాబు కష్టపడి ఉంటే తాడేపల్లి, మంగళగిరి నియోజకవర్గాల్లో ప్రజలు ఎందుకు టీడీపీని ఓడించారని ప్రశ్నించారు.

రాజధాని ప్రాంత రైతులకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు..

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు