చంద్రబాబుకు మోహన్ బాబు వార్నింగ్... నా పేరు తీస్తే...

చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.అంతా ప్రశాంత వాతావరణం అంటూ మోహన్ బాబు మరో ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: November 4, 2019, 5:34 PM IST
చంద్రబాబుకు మోహన్ బాబు వార్నింగ్... నా పేరు తీస్తే...
చంద్రబాబు, మోహన్ బాబు
  • Share this:
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై  మంచు మోహన్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు ఒక్కడే అంటూ మండిపడ్డారు. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకంటూ ఆయనను కోరారు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా! అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదని బాబును ఉద్దేశిస్తూ మరో ట్వీట్ చేశారు.  రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని చంద్రబాబు నోటి నుంచి రావడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు, చంద్రబాబుకు మధ్య విభేదాలు అందరికీ తెలిసినవే. గతంలో తన విద్యాసంస్థలపై టీడీపీ ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతున్నారని మోహన్ బాబు ఆరోపణలు చేశారు. మూడు సంవత్సరాలుగా తమ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ విషయంలో చంద్రబాబుపై పోరాటానికి దిగారు మోహన్ బాబు. అయితే ఆతర్వాత వైసీపీ అధినేత జగన్‌ను కూడా కలిశారు. తాజాగా చంద్రబాబుపై మండిపడుతూ మోహన్ బాబు ట్వీట్స్ పెట్టడం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు... టాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారింది.







First published: November 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>