రామోజీరావుతో మోహన్ బాబు భేటీ... ఆ మూడింటిపై చర్చ

రామోజీరావుతో సమావేశం అయినట్లు సోషల్ మీడియాలలో పోస్టు పెట్టారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించామన్నారు.

news18-telugu
Updated: October 16, 2019, 12:53 PM IST
రామోజీరావుతో మోహన్ బాబు భేటీ... ఆ మూడింటిపై చర్చ
రామోజీరావుతో మోహన్ బాబు భేటీ
  • Share this:
ప్రముఖ సినీనటుడు మంచు మోహన్‌బాబు ... ఈనాడు గ్రూప్స్ ఛైర్మన్ రామోజీరావుతో భేటీ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లిన మోహన్ బాబు... అక్కడ రామోజీరావుతో సమావేశం అయినట్లు సోషల్ మీడియాలలో పోస్టు పెట్టారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించామన్నారు. సినిమా, విద్యతో పాటు రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలపై తాము చర్చించామని మోహన్‌బాబు తన సోషల్ మీడియాలో పేజీలో పోస్టు పెట్టారు. రామోజీరావు ఓ నడిచే ఎన్‌సైక్లోపీడియా అన్న మోహబన్ బాబు... ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలని ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఈ భేటీ పట్ల రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. రామోజీరావుతో మోహన్ బాబు ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చించి ఉంటారని పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.

First published: October 16, 2019, 12:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading