సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు

నా కోరిక ఫలించింది. అందుకే ఏడాదిన్నర తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నా అన్నారు మోహన్ బాబు.

news18-telugu
Updated: July 7, 2019, 10:29 AM IST
సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు
మోహన్ బాబు
news18-telugu
Updated: July 7, 2019, 10:29 AM IST
ప్రముఖ సినీ నటుడు... వైసీపీ నేత  మోహన్ బాబు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ఆయన మిజోరాం మాజీ గవర్నర్‌ వినోద్‌కుమార్‌ దుగ్గల్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మోహన్‌బాబు ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి మంచి ముఖ్యమంత్రి వచ్చాడన్నారు. మంచి పరిపాలన సాగుతోందని అన్నా రు. జగన్‌ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి ఆలయం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ‘నా కోరిక ఫలించింది. అందుకే ఏడాదిన్నర తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నా. ఆ కోరికేంటో భగవంతుడికి తెలుసు’ అని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు అన్నారు.

మరోవైపు మాజీ గవర్న ర్‌ వినోద్‌కుమార్‌ దుగ్గల్‌ మాట్లాడుతూ తిరుమలకు వస్తే ప్రశాంతత లభిస్తుందన్నారు. స్వామి దర్శనం సంతోషం కలిగించిందన్నారు. అందరు బాగుండా లని స్వామిని ప్రార్ధించినట్టు తెలిపారు. గతంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ గెలిచినప్పుడు కూడా మోహన్ బాబు ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. కేసీఆర్‌ గెలవాలని, టిఆర్ఎస్ మళ్లీ రావాలనీ  ప్రార్థించానని అన్నారు  సీనియర్‌ నటుడు మోహన్‌బాబు. ఎన్నికలకు ముందు ఫిలింనగర్‌లోని దేవాలయానికి వెళ్లి కేసీఆర్ మళ్లీ గెలవాలని కోరుకున్నాను అని తెలిపారు.

 

First published: July 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...