Home /News /politics /

MANCHU LAKSHMI TWEET ON MOHAN BABU HOUSE ARREST SB

మోహన్ బాబు హౌస్ అరెస్ట్‌పై మంచు లక్ష్మీ ట్వీట్

మంచు లక్ష్మి మోహన్ బాబు

మంచు లక్ష్మి మోహన్ బాబు

ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మోహన్ బాబు శుక్రవారం ర్యాలీని తలపెట్టారు. దీంతో ఆయనను పోలీసులు ఇంటి నుంచి బటయకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు.

    ప్రముఖ తెలుగు సినీ నటుడు మోహన్ బాబు పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సమస్యలపై ఆయన శుక్రవారం ర్యాలీని తలపెట్టారు. దీంతో ఆయనను పోలీసులు ఇంటి నుంచి బటయకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు. అయితే దీనిపై మోహన్ బాబు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తిరుపతిలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నాను, కానీ తన ఇంటి ముందు ఉన్న పోలీసులు, బయటకు వెళ్లేందుకు అంగీకరించడం లేదంటూ మోహన్ బాబు ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. అయితే దీనిపై ఆయన కూతురు మంచు లక్ష్మీ స్పందించారు. ‘స్కేర్డ్ పీపుల్ ’అంటూ ఆమె ట్వీట్ పెట్టారు. మోహన్ బాబు చేస్తున్న ఆందోళన చూసి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారంటూ ఇన్ డైరెక్ట్‌గా అర్థం వచ్చేలా మంచు లక్ష్మీ స్పందించారు. దీంతో ఇప్పుడు మంచు చేసిన ట్వీట్‌కు విద్యార్థులంతా మద్దతు పలుకుతున్నారు. మంచు ఫ్యామిలీకి అండగా ఉంటామని సపోర్ట్ చేస్తున్నారు.

    ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజుల తిరిగి చెల్లింపు విషయంలో ఆంధ్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా మోహన్ బాబు ధర్నా చేపడతానన్నారు. ఇప్పటికే ఆ మధ్య ఈ విషయంలో ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. మోహన్ బాబు కుమారుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధిపతి అయిన విష్ణు కూడా బాహాటంగా విమర్శలు చేశారు.

    ఇవికూడా చదవండి:

    తిరుపతిలో మోహన్ బాబు హౌస్ అరెస్ట్ 

    వైఎస్ వివేకా హత్యకేసులో పులివెందుల సీఐ సస్పెన్షన్
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Manchu Family, Manchu Lakshmi, Mohan Babu, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు