చంద్రబాబుతో మోహన్ బాబు వాటే కాంబినేషన్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైన తమకు సంబంధించిన స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దానికి త్రోబ్యాక్ పిక్ అనే క్యాప్షన్ ఇవ్వాలి. అంతేకాదు పోస్ట్ చేసే ఫోటోలో ఏదైనా స్పెషాలిటీ ఉండాలి.తాజాగా మంచు లక్ష్మి అపుడెపుడో 17 ఏళ్ల క్రితం 1992లో హెరిటెజ్ మిల్క్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపన సందర్భంగా మోహన్ బాబుతో కలిసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

news18-telugu
Updated: June 26, 2019, 7:31 PM IST
చంద్రబాబుతో మోహన్ బాబు వాటే కాంబినేషన్..
చంద్రబాబు నాయుడు,మోహన్ బాబు
news18-telugu
Updated: June 26, 2019, 7:31 PM IST
ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైన తమకు సంబంధించిన స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దానికి త్రోబ్యాక్ పిక్ అనే క్యాప్షన్ ఇవ్వాలి. అంతేకాదు పోస్ట్ చేసే ఫోటోలో ఏదైనా స్పెషాలిటీ ఉండాలి.తాజాగా మంచు లక్ష్మి అపుడెపుడో 17 ఏళ్ల క్రితం 1992లో హెరిటెజ్ మిల్క్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపన సందర్భంగా మోహన్ బాబుతో కలిసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక్క మాటలో చెప్పలేని భావాన్ని ఒక ఫోటోతో చెప్పేసింది మంచు లక్ష్మి. ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరు ఇపుడు శత్రువులుగా మారారు. వారి స్నేహం బాగా ఉన్న కాలంలో హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీని మోహన్ బాబు భాగస్వామ్యంతో చంద్రబాబు ప్రారంభించాడు. ఆ తర్వాత మోహన్ బాబు ..హెరిటేజ్ మిల్క్ నుంచి వైదొలగారు. ఈ మధ్యకాలంలో మోహన్ బాబు.. టీడీపీ తరుపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వీళ్లిద్దరు సఖ్యతగానే ఉన్నారు. అంతేకాదు.. మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ వార్షికోత్సవాల్లో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భాలున్నాయి. 

Manchu Lakshmi shares throwback pic of ap ex cm nara chandra babu naidu With mohan babu,Mohan babu,chandra babu naidu,mohan babu chandra babu naidu,manchu lakshmi twitter,manchu lakshmi instagram,manchu family,manchu mohan babu,mohan babu twitter,mohan babu instagram,tirupati news,mohan babu house arrest,mohan babu dharna,andhra pradesh news,Andhra pradesh politics,Mohan Babu chandra babu naidu ys jagan mohan reddy politics,Mohan babu Chandra babu naidu ntr YS jagan,మోహన్ బాబు హౌస్ అరెస్ట్,మోహన్ బాబు ధర్నా, శ్రీ విద్యానికేతన్, తిరుపతిలో ఉద్రిక్తత,చంద్రబాబు నాయుడు,టీడీపీ చంద్రబాబు నాయుడు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్,వై.యస్. జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్‌సీపీ పాలిటిక్స్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్,పాలిటిక్స్,చంద్రబాబు నాయుడు,మోహన్ బాబు,మోహన్ బాబు చంద్రబాబు నాయుడు,
చంద్రబాబు నాయుడుతో మోహన్ బాబు పాత చిత్రం (ట్విట్టర్ ఫోటో)


ఇక వైయస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మోహన్ బాబు ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైంది. ఆ తర్వాత మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ..రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తెను ప్రేమ వివాహం చేసుకోవడంతో వైయస్ ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి దగ్గరైంది. కానీ కాలం ఎపుడు ఒకేలా ఉండదు కదా. ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరు.. ఇపుడు నిత్య శతృవులు అయ్యారు. అంతేకాదు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు తన విద్యాసంస్థలకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ సకాలంలో చెల్లించికపోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేసిన సంగతి తెలిసిందే కదా.


Loading...
ఆ తర్వాత మోహన్ బాబు ..వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీలో జాయిన్ అయ్యారు. అంతేకాదు చంద్రబాబు ఎన్నికల ఓడిపోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఎన్నడు లేనట్టుగా 23సీట్లకే పరిమితమైంది. మరోవైపు పులిమీద పుట్రలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ..టీడీపీలో ఉన్న నేతలపై ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రకటించి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అంతేకాదు అసలు కలలో కూడా టీడీపీ జెండాను ఒదలడానికి ఇష్టపడని నేతలు కూడా ఎన్నికల్లో టీడీపీకి తగిలిన దెబ్బతో ఒక్కొక్కరు సైకిల్ దిగే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి అపుడెపుడో జరిగిన హెరిటేజ్ శంకుస్థాపన సందర్భంగా తన తండ్రి మోహన్ బాబుతో ఉన్న చంద్రబాబు ఫోటోను షేర్ చేసి తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గానే చెప్పేసిందని చంద్రబాబు వ్యతిరేకులు ఇపుడు వ్యాఖ్యానిస్తున్నారు. 
First published: June 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...