Home /News /politics /

MANCHU BROTHERS MANOJ AND VISHNU SUPPORT TO VIZAG STEEL PLANT PROTEST NGS

Vizag Steel Plant: విశాఖ ఉద్యమానికి జై కొట్టిన మంచు సోదరులు: టాలీవుడ్ మొత్తం ముందుకొస్తుందన్న మనోజ్

విశాఖ ఉద్యమానికి మంచు సోదరుల మద్దతు

విశాఖ ఉద్యమానికి మంచు సోదరుల మద్దతు

విశాఖ ఉద్యమంలో ముందుండి పోరాడేందుకు టాలీవుడ్ ఎందుకు ముందుకు రావడం లేదు. ఒకరిద్దరు తప్పా మిగిలిన వారు ఎందుకు నోర మెదపలేకపోతున్నారు? దీంతో టాలీవుడ్ తీరుపై కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపారు మంచు బ్రదర్స్ ఇద్దరూ.

ఇంకా చదవండి ...
  విశాఖ ఉక్కు ఉద్యమం ఉద్ధృతమైంది. ఇప్పటికే ఉక్కు ఫ్యాక్టరీలో సమ్మె సరైన్ కూడా మోగింది.  మార్చి 25వ తేదీ లోపు సమ్మెకు దిగుతాం అంటూ కార్మికులు నోటీసులు కూడా ఇచ్చారు. ఇంతలా ఉద్యమం ఎగసిపడుతుంటే అన్ని వర్గాల నుంచి మద్దతు రావాలి. ఇప్పటికే రాజకీయా పార్టీలు మేం మద్దతిస్తున్నాం అంటే మేం మద్ధతిస్తున్నామని చెబుతున్నాయి. కానీ ఏకతాటిపైకి వచ్చి పోరాడడం లేదు. ఇక టాలీవుడ్ అయితే ఇప్పటి వరకు ఉద్యమానికి దూరం దూరంగా ఉంటూ వస్తోంది.

  విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపిన వారిని వేళ్లపై లెక్క కట్టొచ్చు.. అప్పుడెప్పుడో నారా రోహిత్ ఆంధుడా గళమెత్తూ అంటూ ఒక ట్వీట్ చేసి సరిపెట్టుకున్నారు. తరువాత సినిమా రంగానికి చెందిన ఒకరిద్దరు విశాఖ ఉద్యమానికి అనుకూలంగా మాట్లాడారే తప్పా.. ఉద్యమంలో పాల్గొన్నది లేదు. అయితే ఇటీవల లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ ఉక్కుపై క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వంద శాతం ప్రైవేటీవకరణ తప్పదని తేలిపోయింది. అప్పటి నుంచి విశాఖ ఉద్యమం ఇంకాస్త తీవ్రమైంది.

  కేంద్ర మంత్రి ప్రకటనను ఖండిస్తూ తెలంగాణలో ఉన్న మంత్రులు మాట్లాడారు తప్పా.. సినిమా రంగానికి చెందిన వారెవరూ నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దశలో మెగాస్టార్ చిరంజీవి విశాఖ ఉక్కు ఉద్యమంపై స్పందించారు. పోరాడి సాధించిన విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదని.. వెంటనే కేంద్రం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి అంటూ ట్వీట్ చేశారు. ఆ తరువాత ఎక్కడా ఇప్పటి ఆయన మాట్లాడలేదు.

  మరోవైపు పోరాటాన్ని ఉద్ధృతం చేసే దిశలో.. రాజకీయ, సినీ ప్రముఖులను అడ్డుకోవాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే కొందరికీ స్టీల్ ప్లాంట్ సెగ తాకింది కూడా. విశాఖ వచ్చిన సినీ ప్రముఖులను అడ్డుకోవాలని.. అలాగే అయితే ఉద్యమ తీవ్ర అందరికీ అర్థమవుతుందని.. అప్పుడు అన్ని వర్గాలు ముందుకు వస్తాయని కార్మిక సంఘాలు భావిస్తున్నారు. ముఖ్యంగా సినిమా హీరోలు వచ్చినప్పుడు తప్పక అడ్డుకుంటామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో మోసగాళ్లు సినిమా పబ్లిసిటీ కోసం విశాఖ వచ్చిన మంచు విష్ణుకు విశాఖ ఉక్కు ఉద్యమ సెగ తగిలింది. దీనిపై స్పందించిన ఆయన అందరూ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ కారణాలతోనే టాలీవుడ్ పెద్దలు ముందుకు రాలేకపోతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

  తాజాగా మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై స్పదించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం చాలా పెద్ద అన్యాయమన్నారు. తాము హైదరాబాద్‌లో ఉన్నా ఈ విషయంలో చాలా బాధపడుతున్నామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను కొనడానికి ప్రైవేట్‌ సంస్థలు ముందుకొస్తున్నప్పుడు.. ప్రభుత్వం దానిని ఎందుకు లాభాల్లో నడిపించలేకపోతోందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం తన విధానాలను ఎందుకు మార్చుకోకూడదని మనోజ్ ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. దీంతో ఉక్కు ఉద్యమానికి మద్దుతు ఇస్తున్న తొలి టాలీవుడ్ సోదరులుగా మంచు విష్ణు, మనోజ్ నిలిచారు. ఇకపైనైనా టాలీవుడ్ నుంచి ఎవరైనా ముందుకు వస్తారో లేదో చూడాలి.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Manchu Family, Manchu Manoj, Manchu Vishnu, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు