• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MAN TRY TO COMMIT SUICIDE IN ANDHRA PRADESH SAYS YCP LEADERS HARASSING HIM FOR LAND PRN

Andhra Pradesh: నడిరోడ్డుపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం.., వైసీపీ నేతల వేధింపులే కారణమా..?

Andhra Pradesh: నడిరోడ్డుపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం.., వైసీపీ నేతల వేధింపులే కారణమా..?

అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఆత్మహత్యకు యత్నించిన కాలాచారి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) లో కలకలం రేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) కి చెందిన నాయకులు తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నాంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో కలకలం రేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నాంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కాలాచారి స్థానికంగా పంక్చర్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఐతే అధికార పార్టీ నేతల ఒత్తిడితో తన షాపును తొలగించాల్సిందిగా పోలీసులు వేధిస్తున్నారంటూ కాలాచారి ఆరోపిస్తున్నాడు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. జీవనాధారమైన షాపును తొలగిస్తే రోడ్డుపై పడతామని పోలీసులకు మొరపెట్టుకున్నా వినకుండా తన తమ్ముడిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని కాలాచారి ఆరోపించాడు. తన పంక్చర్ షాప్ ఎక్కి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోగా వర్షం కురవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు కాలాచారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. సీఎం జగన్ పై వైసీపీ నేతలపై మండిపడ్డారు. దండుపాళ్యం గ్యాంగ్ పంక్చర్ షాపులను కూడా వదలడం లేదంటూ తీవ్రంగా విమర్సించు. పంక్చర్ షాపు జీవనాధారంగా బ్రతుకుతున్న కాలాచారి కుటుంబాన్ని వైసీపీ నాయకులు వేధించడం దారుణమన్నారు. వైసీపీ నాయకులు, పోలీసుల తీరుతోనే కాలాచారి ఆత్మహత్యకు యత్నించాడని లోకేష్ ఆరోపించారు. వైసీపీ రౌడీలతో కొంతమంది పోలీసులు కుమ్మక్కై సామాన్యులను హింసించడం మంచిపరిణామం కాదన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని లోకేష్ హెచ్చరించారు.



    మరోవైపు పోలీసులు మాత్రం తాము ఎవరిపైనా అక్రమ కేసులు బనాయించలేదని.. నిబంధనల మేరకే నడుచున్నామని చెప్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు